కేంద్ర ప్రభుత్వంపై ఢిల్లీ ఎయిర్ పోర్ట్ దావా... కారణం ఇదే!

కేంద్ర ప్రభుత్వంపై ఢిల్లీ విమానాశ్రయం దావా వేసింది. ఈ విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది.;

Update: 2025-03-17 16:30 GMT

కేంద్ర ప్రభుత్వంపై ఢిల్లీ విమానాశ్రయం దావా వేసింది. ఈ విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. రక్షణశాఖకు చెందిన విమానాశ్రయంలోకి వాణిజ్య విమానాలను అనుమతించడాన్ని సవాల్ చేస్తూ జీఎంఆర్ సంస్థ దావా వేసినట్లు తెలిపింది. ఘాజియాబాద్ ఎయిర్ పోర్ట్ లోకి వాణిజ్య విమానాలను అనుమతిస్తే ఢిల్లీ విమానాశ్రయం ఆర్థికంగా నష్టపోతుందని ఆరోపించింది.

అవును... వాణిజ్య విమానాలను ఘాజియాబాద్ ఎయిర్ పోర్ట్ లోకి అనుమతిస్తే ఢిల్లీ విమానాశ్రయం ఆర్థికంగా నష్టపోతుందని ఆరోపిస్తూ.. మార్చి 10న కోర్టులు దావా దాఖలు చేసినట్లు ఢిల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ లిమిటెడ్ (డీఐఏఎల్) పేర్కొంది.

వాస్తవానికి భారతదేశంలో అత్యంత రద్దీగా ఉండే విమానాశ్రయాల్లో ఢిల్లీ ఎయిర్ పోర్ట్ ఒకటనే సంగతి తెలిసిందే. ఈ క్రమంలో గత ఏడాది సుమారు 73.6 మిలియన్ల మంది ప్రయాణికులు ఇక్కడ నుంచి రాకపోకలు సాగించారు. అయినప్పటికీ... ప్రభుత్వ రుసుములు అధికంగా ఉండటం వల్ల సుమారు 21 మిలియన్ డాలర్ల నష్టం వాటిళ్లినట్లు తెలిపింది.

నివేదికల ప్రకారం.. ఈ దావాలో.. ప్రస్తుత విమానాశ్రయానికి 150 కి.మీ వైమానిక దూరంలో కొత్త విమానాశ్రయాన్ని నిషేధించే నిబంధనలను ప్రభుత్వం ఉల్లంఘించిందని 'డీఐఏఎల్' ఢిల్లీ హైకోర్టులో తెలిపింది.ఇదే సమయంలో... వాణిజ్య విమానాలను ఘాజియాబాద్ ఎయిర్ పోర్ట్ లోకి అనుమతించే ప్రభుత్వ నిర్ణయాన్ని కోర్టు రద్దు చేయాలని "డీఐఏఎల్" కోరుతోంది!

అదేవిధంగా... ఢిల్లీ ఎయిర్ పోర్టు నుంచి సుమారు 30 కి.మీ దూరంలో ఉన్న ఘాజియాబాద్ లోని హిండన్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ నుంచి ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ విమానాలు మార్చిలో పనిచేయడం ప్రారంభించాయని తన వాదనకు మీడియా నివేదికలను ఉదహరించినట్లు చెబుతున్నారు.

కాగా... ఢిల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ యాజమాన్యంలో జీఎంఆర్ కు మెజారిటీ వాటా ఉన్న సంగతి తెలిసిందే. అయితే.. ఈ కేసును నివేదించిన తర్వాత జీఎంఆర్ విమానాశ్రయాల షేర్లు 0.7% వరకూ పడిపోయాయి.

Tags:    

Similar News