బాబుతో పవన్ భేటీ... సీరియస్ గానే డిస్కషన్ !
ఏపీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు.;
ఏపీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. మంత్రివర్గ సమావేశం ముగిసిన వెంటనే ఈ ఇద్దరూ ప్రత్యేకంగా సమావేశం కావడం రాజకీయంగా ఆసక్తిని పెంచుతోంది.
ఉదయం అంతా అసెంబ్లీలో ఈ ఇద్దరూ కనిపించారు. మధ్యాహ్నం తర్వాత మంత్రివర్గ సమావేశంలో కలిశారు. ఇపుడు ప్రత్యేకంగా భేటీ అంటే మ్యాటర్ చాలా సీరియస్ అనే అంటున్నారు. ఈ మధ్యలో జరిగిన అనేక రాజకీయ పరిణామాల మీదనే ఈ ఇద్దరు చర్చించి ఉంటారని అంటున్నారు.
ఏపీలో జనసేన ఆవిర్భావ సభ భారీ ఎత్తున సాగింది. ఈ సభలో పవన్ నాగబాబు చేసిన కామెంట్స్ మీద టీడీపీలో పెద్ద ఎత్తున చర్చ సాగుతోందని అంటున్నారు. సోషల్ మీడియాలో అయితే జనసేన టీడీపీ యాక్టివిస్టుల మధ్య వార్ వేరే లెవెల్ లో ఉంది. ఈ నేపధ్యంలో గ్యాప్ అయితే రెండు పార్టీల మధ్య గ్రౌండ్ లెవెల్ లో వచ్చేసింది అన్న భావన వ్యక్తం అవుతోంది.
అయితే పై స్థాయిలో మాత్రం చంద్రబాబు పవన్ ల మధ్య మంచి అండర్ స్టాండింగ్ ఉందని అంటున్నారు. దాంతో ఈ భేటీలో ఇద్దరు నేతలూ తాజా పరిస్థితుల మీద చర్చించారు అని అంటున్నారు. మరీ ముఖ్యంగా ఏపీలో ఉన్న రాజకీయ వాతావరణం జనసేన టీడీపీ నేతల మధ్య ఉన్న కొంత గ్యాప్ కూడా చర్చకు వచ్చిందా అన్నది కూడా ఆలోచిస్తున్నారు.
ఇక చంద్రబాబు ఈ నెల 18న ఢిల్లీ బయల్దేరి వెళ్తున్నారు. ఆయన ఈ నెల 19న ప్రధాని మోడీని కలసి అమరావతి రాజధాని పునర్నిర్మాణానికి శ్రీకారం చుట్టాలని ఆహ్వానిస్తారు అని అంటున్నారు. ఆ విషయాలను కూడా ఈ భేటీలో బాబు పవన్ తో పంచుకున్నారని అంటున్నారు.
అదే విధంగా ఎమ్మెల్సీగా నెగ్గిన నాగబాబుని మంత్రివర్గంలోకి తీసుకోవడం పైన కూడా చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ చర్చించి ఉంటారని అంటున్నారు. ఈ నెలాఖరు నుంచి నాగబాబు శాసన మండలి సభ్యుడిగా ఉంటారు. దాంతో ఆయనకు ముందస్తుగా ఇచ్చిన హామీ మేర్కౌ మంత్రి పదవి ఇవ్వాల్సి ఉంది. దాని మీద బాబుతో పవన్ చర్చించి ఉంటారు అని అంటున్నారు. అలాగే ఆయన మంత్రి అయితే ఇచ్చే శాఖల మీద చర్చ సాగి ఉంటుందని అంటున్నారు. ఇంకో వైపు చూస్తే బాబు పవన్ ల మధ్యలో ఎలాంటి గ్యాప్ లేదని చెప్పేందుకే ఈ భేటీ జరిగింది అని అంటున్నారు.
బాబు ఉన్న సీఎం చాంబర్ కి పవన్ నేరుగా వెళ్ళి ఆయనతో మాట్లాడం బట్టి చూస్తే కనుక బయట జరుగుతున్నది వేరు కూటమిలో రెండు పార్టీల అధినేతల మధ్య ఉన్న బాండేజ్ వేరు అన్నది కూడా అంతా చర్చిస్తున్నారు బాబు పవన్ లకు కూటమిని ముందుకు కలిసికట్టుగా తీసుకుని వెళ్ళే విషయంలో ఒక ఏకాభిప్రాయం ఉందని అంటున్నారు. రాజకీయ వ్యాఖ్యలు సాధారణంగా వినిపించే సెటైర్లు ఏవీ ఈ రెండు పార్టీల మధ్య గ్యాప్ ని క్రియేట్ చేయలేవని అంటున్నారు.