అప్పు అనే వలయంలో చిక్కుకుంటే దాని నుంచి బయట పడటం ఎంతో కష్టం. అప్పు చేసి పప్పు కూడు అన్న చందంగా ఈ రోజుల్లో చాలామంది అప్పులు చేస్తూ విలాసాలకు అలవాటు పడుతున్నారు. తీరా అప్పులకు ఇబ్బడిముబ్బడిగా వడ్డీ.. బారు వడ్డీ.. చక్రవడ్డీ పెరగడంతో ముఖం చాటేస్తున్న ఘటనలు అనేకం ఉన్నాయి.
చేసిన అప్పులు తీర్చలేక ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకున్న ఘటనలు ఉన్నాయి. అయితే కొంతమంది మాత్రం తెలివిగా ముందస్తుగా ఐపీలు పెడుతూ అప్పులిచ్చిన వారినే ముప్పు తిప్పలు పెడుతున్నారు. మరికొందరేమో బ్రతికి ఉండి కూడా చనిపోయినట్లు నాటకం ఆడుతున్నారు. ఈ క్రమంలోనే కొందరు సినిమాను తలపించే ట్విస్టులు ఇస్తుండటం గమనార్హం.
ఇక అసలు విషయం వెళితే.. జమ్మూ కశ్మీర్ లోని డోడాకు చెందిన మనజీత్ సింగ్(31) అతడి భార్య.. ఆరేళ్ల కూతురు డిసెంబర్ 20 కనిపించకుండా పోయారు. దీంతో పోలీసులు మిస్సింగ్ కేసు భావించి దర్యాప్తు చేస్తున్నారు. ఈ క్రమంలోనే వీరికి సంబంధించిన కారు చినాబ్ నదిలో పడినట్లు గుర్తించారు. వీరికి సంబంధించిన ఐడీ కార్డులు.. డ్రైవింగ్ లైసెన్స్ వంటి ఆధారాలు సంఘటనా స్థలంలో పోలీసులకు లభించాయి.
దీంతో మనజీత్ సింగ్ కుటుంబం కారు ప్రమాదం చనిపోయినట్లు అంతా భావించారు. అయితే మృతదేహాల ఆనవాళ్లు.. లగేజీ వంటివి ఏమి దొరక్కపోవడంతో పోలీసులకు అనుమానం వచ్చి మరో కోణంలో విచారణ చేపట్టారు. ఈ నేపథ్యంలో మనజీత్ సింగ్ అప్పుల విషయం వెలుగులోకి వచ్చింది. వ్యాపార విస్తరణ కోసం మనజీత్ సింగ్ జమ్మూలోని వివిధ బ్యాంకులు.. ప్రైవేట్ వ్యక్తుల నుంచి 30 లక్షల దాకా అప్పు చేశాడని పోలీసులు గుర్తించారు.
అప్పులు ఎగ్గొంటే క్రమంలోనే రాత్రికి రాత్రి అతడు భార్యాపిల్లలతో ఉడాయిండి కారు ప్రమాదం నాటకం ఆడినట్లు పోలీసులు అనుమానించారు. ఈ క్రమంలోనే డోడా సీనియర్ ఎస్పీ అబ్దుల్ ఖయ్యాం వీరిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాన్ని నియమించారు. కారు ప్రమాదం జరిగిన 20 రోజుల తర్వాత హరియాణాలోని పంచకుల వద్ద మనజీత్ సింగ్ కుటుంబాన్ని పోలీసులు గుర్తించారు.
హరియాణా పోలీసుల సహకారంతో వారికి అరెస్టు చేసి జమ్మూకు తరలించారు. మనజీత్ సింగ్ మాస్టర్ ప్లాన్ కాస్త రివర్స్ కావడంతో ప్రస్తుతం జైల్లో కటకటాలు లెక్క పెట్టాల్సి వస్తుంది. ఏది ఏమైనా కొందరు కేటుగాళ్లు అప్పులు ఎగ్గొట్టే క్రమంలోనే ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారు. ఈ సంఘటనపై మీ రియాక్షన్ ఏంటో కింద మాతో పంచుకోండి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.