ప్రపంచదేశాలను కరోనా వైరస్ మహమ్మారి గజగజలాడిస్తోంది. రోజురోజుకూ పెరుగుతున్న పాజిటివ్ కేసులు, మరణాలు ప్రజల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. ఇప్పటికే వివిధ దేశాల శాస్త్రవేత్తలు దీనికి విరుగుడు కనిపెట్టేందుకు రాత్రింబవళ్ళు శ్రమిస్తున్నారు. అలాగే కరోనా బాధితుల సంఖ్య రోజురోజుకి పెరుగుతుంది. సామాన్యులతో పాటుగా వైద్యులు, ప్రముఖులు, ప్రజా ప్రతినిధులు కూడా కరోనా భారిన పడుతున్నారు. ముఖ్యంగా కరోనా బాధితులకి చికిత్స చేస్తూ ... తమ ప్రాణాలకి ప్రమాదం అని తెలిసినా కూడా వారి వృత్తికి న్యాయం చేస్తూ చికిత్స అందిస్తున్నారు. అయితే ఈ మధ్య డాక్టర్స్ కూడా కరోనా భారిన పడుతున్నారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా కూడా వైద్యులు కూడా కరోనా భారిన పడుతుండటం ఆందోళన కలిగిస్తుంది.
అయితే , తమ ప్రాణాలని సైతం తృణ ప్రాయంగా తీసుకోని వృత్తి ధర్మం , మనుషులని కాపాడాలనే మానవతా దృక్పథం తో వైద్యం అందిస్తుంటే , ఓ వైద్యుడికి కరోనా పాజిటివ్ అని తెలిసి , ఆ వైద్యుడిని హాస్పిటల్ చేర్చుకొని ఘటన కర్ణాటక రాజధాని బెంగుళూరులో చోటుచేసుకుంది. కరోనా సోకిందని బెడ్ ఇవ్వాలని కోరితే ఓ డాక్టర్ అనే సానుభూతి కూడా లేకుండా బెడ్ ఇవ్వలేదు. ఆ తరువాత ఓ హాస్పిటల్ లో జాయిన్ అయిన, వ్యాధి తీవ్రత ఎక్కువ కావడంతో కన్నుమూశారు.
ఈ ఘటన పై పూర్తి వివరాలు చూస్తే .. కరోనా సోకిన ఎందరికో వైద్యం చేసి ప్రాణాలు నిలబెట్టిన డాక్టర్ కి సకాలంలో చికిత్స లభించక కన్నుమూశారు. కరోనా పాజిటివ్ అని తెలిసి ఆయన్ని చేర్చుకోవడానికి మూడు ఆసుపత్రులు నిరాకరించడంతో బెంగళూరులో డాక్టర్ మంజునాధ్ నిన్న ప్రాణాలు కోల్పోయారు. రోగులకు చికిత్స అందించే క్రమంలో ఆయనకు వైరస్ సోకగా.. మూడు ఆస్పత్రులు చేర్చుకునేందుకు నిరాకరించాయి. చివరకు ఆసుపత్రి ముందు డాక్టర్ ధర్నాకి దిగడంతో వాళ్ళు అడ్మిట్ చేసుకోగా చికిత్స పొందుతూ నిన్న చనిపోయారు. డాక్టర్స్ ని దేవుళ్లతో పోల్చే ఈ సమాజంలో ఓ డాక్టర్ కి ఇలాంటి ఘటన జరగడం దురదృష్టకరం.