బ్లాక్ ఫంగస్ కి హైదరాబాద్ సెలాన్ డ్రగ్ !

Update: 2021-06-01 23:30 GMT
కరోనా వైరస్ బాధితుల్లో  బ్లాక్ ఫంగస్కు చెక్ పెట్టేందుకు మరో డ్రగ్ మార్కెట్లోకి అందుబాటులోకి వచ్చింది. హైదరాబాద్ కు చెందిన సెలాన్ ల్యాబొరేటరీస్ ఆంఫోటెరిసిన్ బీ అనే ఎమల్షన్ రూపంలో ఉండే డ్రగ్ ను నేడు మార్కెట్ లోకి విడుదల చేసింది. బ్లాక్‌ ఫంగస్‌ చికిత్సలో వాడే లిపోసోమాల్‌ యాంఫోటెరిసిన్‌-బి ఔషధానికి కొరత ఉన్న నేపథ్యంలో ఎమల్షన్‌ ఆధారిత యాంఫోటెరిసిన్‌-బి ఫార్ములేషన్‌ ను కంపెనీ అందుబాటులోకి తెచ్చింది. రోజుకు 10,000 వయల్స్‌ తయారు చేయగల సామర్థ్యం ఉందని సంస్థ వెల్లడించింది.

వీటితో నెలకు 6,000 మంది రోగులకు ఉపశమనం కలుగుతుందని వివరించింది.  లిపోసోమల్ ఆంఫోటెరిసిన్ బీ అనే మెడిసిన్ ను సెలాన్ కంపెనీ 2013 నుంచి ఉత్పత్తి చేస్తోంది. జర్మనీ నుంచి లిపోయిడ్స్ ముడి పదార్థాలు నిలిచిపోవటంతో, ఎమల్షన్ రూపంలో ప్రత్యామ్నాయ మెడిసిన్ ను సెలాన్ కంపెనీ తమ ఆర్ అండ్ టీం కృషి ద్వారా మూడు వారాల్లో అందుబాటులోకి తీసుకువచ్చింది. ప్రస్తుతం బ్లాక్ ఫంగస్ వ్యాధికి మందుల కొరత తీవ్రంగా ఉన్న నేపథ్యంలో ఈ ఎమల్షన్ అందుబాటులోకి రావడం రోగులకు ఊరట కలిగిస్తోందని సెలాన్ తెలిపింది. రోజుకు పదివేల వయల్స్ ఉత్పత్తి చేసి ఆస్పత్రులు, కొవిడ్ చికిత్స కేంద్రాలకు సరఫరా చేస్తామని.. తద్వారా నెలకు 6 వేల మంది బ్లాక్ ఫంగస్ రోగులకు ఊరట లభిస్తుందని సెలాన్ వెల్లడించింది. లిపాయిడ్స్‌ ను జర్మనీ నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. సెలాన్‌ ను లండన్‌ కు చెందిన కెలిక్స్‌ బయో ప్రమోట్‌ చేస్తోంది.
Tags:    

Similar News