కరోనా భయంతో మానవత్వం మంట కలుస్తోంది. కరోనా అని తెలిస్తే కనీసం అటువైపు చూసేందుకు కూడా చాలా మంది భయపడుతున్నారు. కరోనా పేషంట్స్ ను పురుగులు చూసినట్లుగా చూస్తూ అత్యంత హీనంగా ప్రవర్తిస్తున్నారు. ఇక దేశ వ్యాప్తంగా కరోనా కేసులు అత్యధికంగా నమోదు అవుతూ ఉన్నాయి. ఈ సమయంలో అన్ని చోట్ల కూడా ఆక్సీజన్ కొరత తీవ్రంగా ఉంది. ఆక్సీజన్ కొరత వల్ల ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఆక్సీజన్ ఉన్న చోట ఎక్కువ తక్కువ ఉంటుంది. ఉండని చోట అస్సలు ఉండటం లేదు. ఇలాంటి సమయంలో ఆక్సీజన్ కొరకు ఒక యువతి అభ్యర్థించిన సమయంలో తన కోరిక తీర్చితే ఆక్సీజన్ సమకూర్చుతానంటూ ఆఫర్ ఇచ్చిన సంఘటన చర్చనీయాంశంగా మారింది.
ఢిల్లీకి చెందిన ఒక యువతి ఇటీవల తన స్నేహితుడి కుటుంబ సభ్యులకు అత్యవసరంగా ఆక్సీజన్ ఏర్పడింది. దాంతో ఆక్సీజన్ కోసం ఆమె పలు చోట్ల ప్రయత్నించింది. చివరకు తనకు చాలా కాలంగా తెలిసిన వ్యక్తిని.. సోదరుడిగా భావించిన వ్యక్తిని ఆక్సీజన్ కోసం సంప్రదించింది. ఆ సమయంలో అతడు తనతో రూమ్ కు వచ్చి తన కోరిక తీర్చితే వెంటనే ఆక్సీజన్ ను సమకూర్చుతాను అంటూ సమాధానం చెప్పాడట. అతడి మాటలతో షాక్ అయిన యువతి ఆ విషయాన్ని నెట్టింట షేర్ చేసింది. ఇలాంటి వ్యక్తిని ఏం చేయాలో మీరు చెప్పండి అంటూ ఆమె ట్విట్టర్ లో పేర్కొంది.
ఆమె ట్వీట్ తక్కువ సమయంలోనే వైరల్ అయ్యింది. ఆమెకు మద్దతుగా చాలా మంది స్పందించారు. వెంటనే ఆ నీచుడిపై పోలీసులకు ఫిర్యాదు ఇవ్వండి అంటూ కొందరు.. మరి కొందరు అతడికి తగిన బుద్ది చెప్పేలా వెంటనే అతడి వివరాలు ఫొటోను కూడా సోషల్ మీడియాలో షేర్ చేయండి అంటూ సమాధానం ఇచ్చారు. ఈ సమయంలో ఇలాంటి నీచులు కూడా ఉన్నారా అంటూ విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.