ఆమూల్ కేసులో ఏపీ సర్కార్ కు ఎదురుదెబ్బ

Update: 2021-06-04 15:30 GMT
దేశీయ ప్రముఖ పాల ఉత్పత్తిదారుల కంపెనీ అమూల్ కేసులో ఏపీ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. అమూల్ తో కుదుర్చుకున్న ఎంవోయూపై ఎలాంటి నిధులు వెచ్చించవద్దని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశించింది.

అమూల్ తో ప్రభుత్వ ఒప్పందాన్ని సవాల్ చేస్తూ ఎంపీ రఘురామకృష్ణంరాజు హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది ఆది నారాయణరావు వాదనలు వినిపించారు. నేషనల్ డెయిరీ డెవలప్ మెంట్ బోర్డు, గుజరాత్ లోని అమూల్ కి నోటీసులు జారీ చేయాలని కోర్టు ఆదేశించింది.

అమూల్ తో కుదుర్చుకున్న అవగాహన ఒప్పందంపై ఎలాంటి నిధులు ఖర్చు చేయవద్దని న్యాయస్థానం ఆదేశించింది. ఈనెల 14వ తేదీకి కేసు విచారణను హైకోర్టు వాయిదా వేసింది.

ఏపీడీడీఎప్ ఆస్తులను లీజు పద్ధతిలో అమూల్ సంస్థకు బదిలీ చేస్తూ సీఎం జగన్ అధ్యక్షతన కేబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని హైకోర్టులో రఘురామ సవాల్ చేశారు. ఈ నిర్ణయాన్నిచట్టవిరుద్ధంగా ప్రకటించి రద్దు చేయాలని కోరుతూ రఘురామ పిల్ వేశారు.
Tags:    

Similar News