రెస్టారెంట్‌ లో ఏసీ గాలి..3 ఫ్యామిలీలకు కరోనా..తస్మాత్ జాగ్రత్త!

Update: 2020-04-22 14:00 GMT
ఇది సమ్మర్ కదా ..? కాసింత రిలాక్స్ అవ్వడానికి ఏసీ ఆన్ చేద్దాం అనుకుంటున్నారా ?తస్మాత్ జాగ్రత్త. ఎందుకంటే ఏసీ గాలి ద్వారా కరోనా వ్యాపిస్తోంది. రెస్టారెంటుకు వెళ్లిన మూడు కుటుంబాలకు కరోనా వైరస్ సోకింది. ఆ రెస్టారెంటులో కరోనా సోకిన వ్యక్తి ద్వారా ఏసీ గాలిలో విస్తరించింది. అదే రెస్టారెంటులో ఉన్న ఈ మూడు ఫ్యామిలీ సభ్యులందరికి కరోనా సోకినట్టు ఓ నివేదిక వెల్లడించింది. కరోనా వైరస్ వెలుగులోకి వచ్చిన వుహాన్ సిటీలో పూర్తిగా లాక్ డౌన్ ప్రకటించలేదు. ఆ సమయంలో Guangzhou ప్రావిన్స్ లో ఉన్న ఓ రెస్టారెంటుకు ఒక ఫ్యామిలీ డిన్నర్ చేసేందుకు వెళ్లింది.

అక్కడి డైనింగ్ టేబుళ్ల పై కూర్చొని భోజనం చేశారు. ఈ కుటుంబం వుహాన్ సిటీ నుంచి రెస్టారెంటుకు వచ్చింది. వీరిలో ఒకరికి కరోనా వైరస్ ఉంది. ఆ విషయం వారికి కూడా తెలియదు. దీనితో వారితో పాటు అదే రెస్టారెంటులో కూర్చొన మరో మూడు ఫ్యామిలీకి వైరస్ సోకింది. కొన్ని రోజుల తర్వాత తొమ్మిది మందిలో కరోనా వైరస్ లక్షణాలు కనిపించడం ప్రారంభమయ్యాయి. వీరిలో ఎవరూ కూడా వైరస్ వ్యాప్తి చేసిన వారిని కనీసం కలవలేదు.. వారితో మాట్లాడనూ లేదు. ఎలాంటి ఎటాచ్ మెంట్ లేదు. కానీ , 9 మందికి కరోనా వైరస్ సోకింది. దీని పై దర్యాప్తు చేయగా ఎయిర్ కండీషర్ నుంచే గాలి ద్వారా వైరస్ వారందరికి వ్యాపించిందని తేలింది.

చైనీస్ రెస్టారెంటులో జరిగిన ఆసక్తికరమైన ఈ కేసును చైనా సెంటర్ ఫర్ డీసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ కు చెందిన నిపుణులు గుర్తించినట్టు న్యూయార్క్ టైమ్స్ నివేదించింది. మూడు కుటుంబాలకు వైరస్ సోకడానికి ఫ్యామిలీ-A లో ఎవరికో ఒకరికి వైరస్ తప్పక ఉండి ఉంటుందనే నిర్ణయానికి నిపుణులు వచ్చారు. కరోనా వైరస్ ఉన్న వ్యక్తి కుటుంబాన్ని నిపుణులు ఫ్యామిలీ-Aగా పేరు పెట్టారు. ఇతర రెండు కుటుంబాలను ఫ్యామిలీ-B - ఫ్యామిలీ-C లుగా పేర్లు పెట్టారు.

జనవరి 24న Guangzhouలో రెస్టారెంటులో ఈ ఫ్యామిలీ విందు చేసింది. మరుసటి రోజు తర్వాత వారిలో 63ఏళ్ల వృద్ధురాలికి దగ్గు మొదలైంది.. జ్వరం కూడా వచ్చింది. ఆమెకు కరోనా పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ అని తేలింది. అందిన రిపోర్టు ప్రకారం రెస్టారెంట్ ‌లో భోజనం చేసిన 9 మందిలో రెండు వారాల్లోగా అదే రోజున కరోనా పాజిటివ్ అని తేలింది. NYT రిపోర్టు ప్రకారం.. ఈ కేసుతో పాటు ఇలాంటి ఇతర కేసుల్లో డైనింగ్ నమూనాలు - తినేవారి విధానంతో ప్రపంచవ్యాప్తంగా ఈ వైరస్ వ్యాప్తి చెంది ఉండొచ్చునని నిపుణులు విశ్వసిస్తున్నారు. వైరస్ బాధితుడు తుమ్మినా లేదా దగ్గినప్పుడు వారి నుంచి నీటి బిందువులు.. వైరస్ ఎయిర్ కండీషనింగ్ యూనిట్ ద్వారా ఇతరులకు వ్యాపించి ఉండొచ్చునని చైనీస్ పరిశోధకులు నిర్ధారించారు.
Tags:    

Similar News