రేవంత్ పై ఏసీబీ ఛార్జిషీట్

Update: 2015-07-28 09:07 GMT
రెండు తెలుగు రాష్ర్టాల మ‌ధ్య అగ్గి రాజేసిన ఓటుకు నోటు కేసు మ‌ళ్లీ జోరందుకుంది.. ఈ కేసులో తాజాగా ఏసీబీ చార్జ్ షీట్ దాఖ‌లు చేయడంతో సద్దుమణుగుతుందనుకుంటున్న కేసు మళ్లీ స్పీడందుకుంటోంది. చార్జ్ షీట్ లో ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి, సెబాస్టియ‌న్, ఉద‌య్ సింహ‌, మ‌త్తయ్యల పేర్లను చేర్చింది. మొత్తం 39 మంది సాక్షుల‌ను విచారించిన‌ట్లు చార్జ్ షీట్ లో ఏసీబీ పేర్కొంది.

తెలంగాణ రాష్ట్ర అవినీతి నిరోధక శాఖ మంగళవారం ఈ ఛార్జీషీట్ వేసింది. ఇందులో తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేత రేవంత్ రెడ్డి - ఉదయ్ సిన్హా - సెబాస్టియన్ - జెరూసలేం మత్తయ్య పేర్లను పేర్కొంది. తాము 39 మంది సాక్ష్యులను విచారించినట్లు ఛార్జీషీటులో పేర్కొంది. గత రెండు నెలలుగా ఈ ఓటుకు నోటు కేసు ఎన్ని సంచలనాలకు వేదికైందో తెలిసిందే. ఈ కేసులో రేవంత్ రెడ్డి - ఉదయ్ సిన్హా - సెబాస్టియన్‌లు అరెస్టై నెల రోజుల అనంతరం జైలు నుంచి విడుదలయ్యారు. సండ్ర వెంకట వీరయ్యను పోలీసులు ఆ తర్వాత అరెస్టు చేశారు. ఆయనకు బెయిల్ వచ్చింది. రేవంత్ - సెబాస్టియన్ - ఉదయ్ - సండ్ర - ప్రదీప్ చౌదరి - పుల్లారావు - వేం నరేందర్ రెడ్డి - వేం తనయుడు కృష్ణకీర్తన్ రెడ్డి తదితరులు సహా మొత్తం 39 మందిని విచారించినట్లు ఛార్జీషీటులో ఏసీబీ పేర్కొంది. అయితే.. ఈ ఛార్జి షీటు వల్ల కేసులో పురోగతి ఏమీ ఉండదని.. ఇప్పటికే మొదలైన ప్రక్రియను కొనసాగించాల్సి ఉంటుంది కాబట్టి ప్రాసెస్ అవుతోందని.. అభియోగాలు వీగిపోతాయని... రెండు రాష్ట్రాల మధ్య ఈ వివాదం ఇప్పటికే చల్లారిందని పలువురు పేర్కొంటున్నారు. మరి తాజా పరిణామాలతో వేడెక్కుతుందో... చల్లారుతుందో చూడాలి.
Tags:    

Similar News