రూ.1.10 కోట్లు లంచంగా తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ కీసర తహసీల్దార్ కేసులో అధికారుల మైండ్ బ్లాంక్ అయ్యే విషయం బయటపడింది. తాజాగా ఏసీబీ విచారణలో తహసీల్దార్ నాగరాజుకు చెందిన బ్యాంకు లాకర్ తెరిచేందుకు అధికారులు ఇన్ని రోజులుగా ఇబ్బంది పడ్డారు. బ్యాంకు లాకర్ గురించి నాగరాజు ఏసీబీకి తెలుపలేదు. తాజాగా విషయం తెలిసిన ఏసీబీ అధికారులు ఆ లాకర్ ను తెరిచారు.
హైదరాబాద్ అల్వాల్ లోని ఓ బ్యాంకులో ఉన్న ఈ లాకర్ ను తెరవగా అందులోని ఆభరణాలు, వజ్రవైఢూర్యాలు చూసి అధికారుల మతిపోయింది. ఏకంగా రూ.57 లక్షల విలువైన బంగారు, వజ్రాభరణాలు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. వాటన్నింటిని ఏసీబీ అధికారులు సీజ్ చేశారు.
కాగా నాగరాజు ఈ లాకర్ ను తన బినామీ పేరుతో పెట్టుకున్నట్టు ఏసీబీ అధికారులు గుర్తించారు. బావమరిది నరేందర్ పేరుతో సౌత్ ఇండియన్ బ్యాంకులో సీక్రెట్ లాకర్ ఉంది.
కాగా నాగరాజు భార్య కోసం ఏసీబీ అధికారులు గాలిస్తున్నారు. నాగరాజు పట్టుబడినప్పటి నుంచి ఆమె బంగారం, డబ్బుతో పారిపోయిందని అనుమానిస్తున్నారు. ఆమె ఇంకా పరారీలోనే ఉంది.