ఆన్ లైన్ టికెటింగ్ విధానంపై ప్రభుత్వాన్ని విమర్శించిన పవన్ కల్యాణ్ పై వైసీపీ నేతలు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తోన్న సంగతి తెలిసిందే. ఇక, ఈ వివాదం నేపథ్యంలో పవన్ పై సినీ నటుడు పోసాని చేసిన బూతుల కామెంట్లు పెను దుమారం రేపుతున్నాయి. ఈ నేపథ్యంలోనే పోసానిపై ఏపీ టీడీపీ అధ్యక్షుడు కింజెరపు అచ్చెన్నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. పోసాని పెయిడ్ ఆర్టిస్ట్ అని, ఆయన బూతులు సభ్య సమాజం తలదించుకునేలా ఉన్నాయని అచ్చెన్నాయుడు మండిపడ్డారు. చీప్ లిక్కర్ తాగిన తాగుబోతులు కూడా ఈ విధంగా మాట్లాడరేమోనని అన్నారు.
జగన్ రెడ్డి, ప్రశాంత్ కిషోర్ ల వికృత క్రీడకు పోసాని పెయిడ్ ఆర్టిస్ట్ అని, జుగుత్సాకరమైన భాషను పోసాని ప్రయోగించి మాట్లాడడం భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను మంటగలపడమేనని దుయ్యబట్టారు. పవన్ కుటుంబ సభ్యులపై పోసాని చేత పీకే టీం మాట్లాడిస్తుంటే జగన్ ఎందుకు వారించడం లేదని అచ్చెన్న నిలదీశారు. సామాన్యులు వినలేని.. మాట్లాడలేని భాషలో వైసీపీ నేతలు మాట్లాడుతుంటే జగన్ రెడ్డి ఆనందంలో మునిగితేలుతున్నారన్నారని ఎద్దేవా చేశారు.
ధరలు పెంచడం, దోపిడీకి పాల్పడటం వంటి చర్యలతో ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత పెరిగిందని, దాని నుంచి ప్రజల దృష్టిని పక్కదారి పట్టించేందుకే పీకే డైరెక్షన్‌లో వైసీపీ నేతలు కుల, మత, ప్రాంతీయతత్వాన్ని రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు. రాజకీయ విమర్శలకు బూతులు వాడడం సరికాదని, వైసీపీ నేతలు ఇలాగే దూషణలకు దిగితే ప్రజలు గుణపాఠం చెబుతారని అచ్చెన్న హెచ్చరించారు. ఏపీలో డ్రగ్స్ మాఫియా పేట్రేగిపోతోందని, 2 లక్షల కోట్ల డ్రగ్స్ మాఫియాకు ఏపీ అడ్డాగా మారిందని అచ్చెన్న ఆరోపించారు. ఈ మాఫియాలో ఆఫ్ఘన్ టెర్రరిస్టులు కూడా కుమ్మక్కై దేశ ద్రోహానికి పాల్పడుతున్నారని అచ్చెన్న సంచలన వ్యాఖ్యలు చేశారు.