మండల మకరవిలక్కు పూజల కోసం శబరిమల అయ్యప్ప స్వామి ఆలయ తలుపులు తెరిచిన సందర్భం కొత్త సందడికి - ఆందోళనలకు కారణం అయింది. ఇవాళ సాయంత్రం 5 గంటలకు ఆలయ ద్వారాలను తెరిచారు. దీంతో భారీ సంఖ్యలో భక్తులు అయ్యప్పను దర్శించుకుంటున్నారు. మరో వైపు శబరిమల ప్రాంతం అంతా వార్ జోన్ గా మారింది. కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. కొచ్చి విమానాశ్రయంలో సామాజిక కార్యకర్త తృప్తి దేశాయ్.. ఇంకా దిగ్భందంలోనే ఉన్నారు. తృప్తి దేశాయ్ ను ఆందోళనకారులు అడ్డుకుంటున్నారు. భూమాత బ్రిగేడ్ మహిళా కార్యకర్తలను అడ్డుకున్న 250 మందిపై పోలీసులు కేసులు నమోదు చేశారు.
శబరిమల అయ్యప్ప దర్శనం కోసం తృప్తి ఇవాళ ఉదయం 5 గంటలకే కొచ్చి చేరుకున్నారు. పూణే నుంచి ఆరు మంది మహిళలతో కలిసి తృప్తి దేశాయ్ కొచ్చి బయలుదేరారు. తృప్తి దేశాయ్ శబరిమల దర్శనానికి వస్తున్నారని వార్త నేపథ్యంలో హిందూ సంఘ - సంస్థలు భారీ సంఖ్యలో ముందుగానే కొచ్చి అంతర్జాతీయ విమానాశ్రయం చేరుకున్నారు. విమానాశ్రయం వద్ద ఉన్న ట్యాక్సీ డ్రైవర్లు సైతం మిమ్మల్ని ఇక్కడి నుంచి బయటకు తీసుకెళ్లం అంటూ తృప్తి దేశాయ్ కు వ్యతిరకంగా నినాదాలు చెయ్యడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఎట్టిపరిస్థితుల్లో తృప్తి దేశాయ్ ను విమానాశ్రయం నుంచి బయటకురానివ్వం అంటూ ఆందోళనకారులు తేల్చి చెప్పారు. శబరిమల అయ్యప్ప స్వామిని దర్శించుకోకుండా తను మహారాష్ట్ర తిరిగివెళ్లను అని తృప్తి దేశాయ్ తేల్చి చెప్పారు. తృప్తి దేశాయ్ కి - ఆందోళనకారులకు నచ్చచెప్పడానికి పోలీసులు ప్రయత్నించారు. అయితే ఇరు వర్గాలు వెనక్కి తగ్గకపోవడంతో ఎయిర్ పోర్టు వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో తనకు రక్షణ కల్పించాలంటూ హైకోర్టుకు వెళ్లనున్నట్లు తృప్తి పేర్కొన్నారు. సుమారు 16 వేల మంది పోలీసులు శబరిమలలో పహారా కాస్తున్నారు. 920 మంది మహిళా పోలీసులు కూడా భద్రత బృందంలో ఉన్నారు. రెండు దశల్లో భద్రతను కల్పించనున్నారు. రెండు కంపెనీల ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ - రెండు దళాల ఎన్డీఆర్ ఎఫ్ బృందాలు కూడా శబరిమల వద్ద భద్రత కల్పించనున్నాయి.