ఈనెల 9న జైపూర్ లో నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్న కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ.. నిర్మలా సీతారామన్ ను కించపరిచేలా వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.. ఓ మహిళను అని చూడకుండా ఆమెను అవమానించడం దేశవ్యాప్తంగా దుమారం రేపింది. పార్లమెంట్ లో ఓ మహిళను తనను కాపాడమని మోడీ కోరి పారిపోయాడని రాహుల్ విమర్శించారు. దీనిపై మహిళా కమిషన్ కూడా రాహుల్ కు గురువారం నోటీసులు జారీ చేసింది.
అయితే ఈ వ్యాఖ్యల విషయంలో తాజాగా రాహుల్ గాంధీకి ప్రకాష్ రాజ్ మద్దతు పలికారు. ‘రాహుల్ గాంధీ మహిళా వ్యతిరేకి కాదు. ఇటీవలే ఓ ట్రాన్స్ జెండర్ ను కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం జాతీయ కార్యదర్శిగా నియమించారు. ఆయన వ్యాఖ్యల్ని తప్పుగా అర్థం చేసుకున్నారు. రాఫెల్ గురించి మోడీ పార్లమెంట్ లో ప్రజలకు జవాబు చెప్పడం లేదు. పార్లమెంట్ లో ఈ విషయం గురించి మాట్లాడడం లేదు.. రాహుల్ చెప్పింది నిజమే కదా’ అని రాహుల్ కు సపోర్టుగా ప్రకాష్ రాజ్ మాట్లాడారు.
ప్రకాష్ రాజ్ కొంత కాలంగా మోడీని - బీజేపీ విధానాలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. బెంగళూరు సెంట్రల్ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా కూడా పోటీచేస్తానని ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఎంపీగా పోటీచేస్తూ జాతీయరాజకీయాల్లో కీలకంగా ఉన్న రాహుల్ గాంధీని వెనకేసుకురావడం రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.
Full View