పవన్ పై ప్రేమకవిత.. రాసిందెవరో తెలుసా?

Update: 2019-09-09 07:13 GMT
ఒక ప్రముఖుడికి రాసిన ప్రేమలేఖను మరో సెలబ్రిటీ రాయటం.. దానికి సంబంధించిన కాపీని బయటపెట్టటం లాంటివి చాలా అరుదుగా జరుగుతుంటాయి. ఇప్పుడు అదే పని చేసి.. అందరి చూపు తన మీద పడేలా చేశారు సినీ నటి కమ్ బీజేపీ రాజకీయ నేత మాధవిలత గా చెప్పాలి. అయితే.. పవన్ మీద ఆమెదంతా వన్ సైడ్ లవ్ మాత్రమే.

ఎందుకంటే తాజాగా తన ఫేస్ బుక్ అకౌంట్ లో పోస్ట్ చేసిన ప్రేమలేఖ ఇప్పటిది కాదు.. దాదాపు పందొమ్మిది  సంవత్సరాల క్రితం నాటిది. 2000 జూన్ ఆరో తేదీన పవన్ కల్యాణ్ ను ఉద్దేశించి తాను రాసుకున్న ప్రేమకథను తన ఫేస్ బుక్ ఖాతాలో పంచుకున్నారు.  మాధవిలత ప్రేమకవిత రాసుకున్నసమయాన్ని చూస్తే.. ఆ ఏడాది ఏప్రిల్ లో పవన్ నటించిన బద్రి విడుదలైంది. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఆ సినిమా ఎంత సూపర్ హిట్ అయ్యిందో చెప్పాల్సిన అవసరమే లేదు.

ఆ సినిమాతో పవన్ గ్రాఫ్ భారీగా పెరిగిపోవటమే కాదు.. యూత్ లో ఆయన క్రేజ్ విపరీతంగా పెరిగింది. అబ్బాయిలే కాదు అమ్మాయిలు కూడా ఆయన ఇమేజ్ కు ఫిదా అయ్యారు. అలాంటి సమయంలోనే మాధవిలత పవన్ మీద ప్రేమకవితను రాసుకున్నారు.

అప్పట్లో మాధవి లత రాసిన ప్రేమకవితను చూస్తే..

‘మనసులో ఏదో వేదన
కారణం తెలియక పడుతున్నా తపన
హృదయంలో అనురాగం అనే భావన
దానికో రూపం ఇచ్చేందుకే ఈ సాధన
నీవు కనిపించగానే నా హృదయంలో ఏదో బాధ
నా మనస్సుని ఎవరో గట్టిగా పట్టేసినట్టుగా వేదన
ఒకపక్క సంతోషం, మరోపక్క దుఃఖం కానీ,.... కానీ ఎందుకో తెలీదు
నిను చూస్తున్న ప్రతీక్షణం నేను కారణం చెప్పలేని భావాలలో విలవిల్లాడిపోతాను. దానికి అర్థం ఏంటి? నేను ఎందుకిలా అవుతున్నాను?
ఇది ఆకర్షణా? ప్రేమ అనే వ్యామోహమా?
No. కానే కాదు. అటువంటిది కాదు. మరేంటి?.....’

పవన్ కు ఢైహార్ట్ ఫ్యాన్ గా ఉన్న మాధవీలత. .తర్వాతి కాలంలో సినిమాల్లోకి రావటం తెలిసిందే. కొన్ని సినిమాలు చేసినా.. ఆమె ఎప్పుడూ పవన్ సినిమాల్లో నటించలేదు. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటూ రాజకీయాల్లోకి వెళ్లిన ఆమె.. గత ఎన్నికల్లో ఏపీలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరఫున పోటీ చేసి ఓటమిపాలయ్యారు. తాజాగా ఆమె.. పవన్ పై తాను రాసుకున్న ప్రేమకవితను బయటపెట్టారు.


Tags:    

Similar News