ఏపీలో ఊహించని పరిణామాలు జరుగుతాయని జగన్ కి అత్యంత సన్నిహితుడు అయిన మునిసిపల్ శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ చెపారు. అవేంటి అన్నవి మీరే చూస్తారు అని మీడియాను ఊరించేసారు. జగన్ కర్నూల్ టూర్ నేపధ్యంలో ఒక రోజు ముందు అక్కడకి చేరుకున్న మంత్రి సురేష్ చాలా విషయాలు చెప్పనంటూనే చెబుతూ సస్పెన్స్ పెంచారు.
మీరు అలా చూస్తూ ఉండండి కర్నూల్ కి న్యాయ రాజధాని అలా తరలి వస్తుంది అని మంత్రి చెప్పారు. అయితే ఈ విషయం తాను చెప్పకూడదు అని అంటూనే సురేష్ చెప్పడం గమనార్హం. అదే విధంగా ఏపీలో ఆగస్ట్ 15 తరువాత ఎన్నిలో కీలకమైన పరిణామాలు చోటు చేసుకుంటాయని కూడా మంత్రి గారు జోస్యం చెబుతున్నారు.
మంత్రి చెబుతున్నారు అంటే ఆ కీలకమైన పరిణామాలు ఏపీ సర్కార్ కి అనుకూలమైనవే అనుకోవాలి. అదే టైమ్ లో ఆయన ఇంకో మాట కూడా అంటున్నారు. ఏపీలో అధికార వికేంద్రీకరణతోనే అన్ని ప్రాంతాలు కచ్చితంగా అభివృద్ధి చెందుతాయని ఆయన అన్నారు.
గత ప్రభుత్వం అమరావతి పేరుతో గ్రాఫిక్స్ ని చూపించిందని, కొన్ని ప్రాంతాలు కొన్ని సామాజికవర్గాలకే ప్రాధాన్యత ఇచ్చిందని, వైసీపీ మార్క్ అభివృద్ధి వికేంద్రీకరణతో అన్ని ప్రాంతాలు సమగ్రమైన అభివృద్ధి జరుగుతుందని చెప్పారు.
సరే మంత్రి సురేష్ చెప్పిన అభివృద్ధి ఎలా ఉన్నా ఆగస్ట్ 15 ముహూర్తం ఎందుకు పెట్టారు. ఆ తరువాత ఏం జరుగుతుంది. ఏపీ సర్కార్ కోరుకున్నట్లుగా మూడు రాజధానుల కధ ముందుకు కదులుతుందా. న్యాయ రాజధానిగా కర్నూల్ అంటున్న మంత్రి గారు విశాఖకు పాలనా రాజధాని అని చెప్పకనే చెప్పేశారా.
మరి ఇప్పటికే హై కోర్టు అమరావతి రాజధాని మీద తుది తీర్పు ఇచ్చేసింది. దీని మీద చట్టం పార్లమెంట్ లో సవరణ అయినా చేయాలి. లేకపోతే సుప్రీం కోర్టులో అప్పీల అయినా చేయాలి. మరి ఆగస్ట్ తరువాత ఏం జరుగుతుంది. మొత్తానికి మంచి సస్పెన్స్ లో పెట్టేశారు సురేష్ అంటున్నారు.