ఆదినారాయణరెడ్డిని బీజేపీ సైడ్ చేసిందా... ?

Update: 2022-01-13 01:30 GMT
కడపలో ఆయన పెద్ద లీడర్ కిందనే లెక్క. ఆయన ఇపుడు బీజేపీలో ఉన్నారు. ఒక విధంగా ఆయన రాయలసీమలో బీజేపీకి బలమైన నేతగా అన్ని విధాలుగా చూడాలి. కానీ ఆయన ఈ మధ్య ఫుల్ సైలెంట్ అయ్యారు. బీజేపీ కూడా ఆయన్ని పక్కన పెట్టింది అన్న రూమర్స్ అయితే గట్టిగా ఉన్నాయి. ఇంతకీ దీని వెనక కధ ఏంటి, కమామీషూ ఏంటి అంటే చాలానే ఉంది అంటున్నారు.

నిజానికి కాంగ్రెస్ ద్వరా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన  ఆయన తన  రాజకీయ జీవితమైతే ఆయన అన్ని పార్టీలనూ చూసేశారు. కాంగ్రెస్ నుంచి జగన్ పార్టీ వైపు 2012 తరువాత వెళ్ళిన ఆదినారాయణరెడ్డి 2014 ఎన్నికల వేళ అక్కడ నుంచి వైసీపీ టికెట్ మీద గెలిచారు. ఆ తరువాత ఆయన మూడేళ్ళు కూడా తిరగకుండానే టీడీపీలోకి జంప్ చేసి ఏకంగా మంత్రి అయిపోయారు. అలా టీడీపీతోనే ఉంటూ ఆయన 2019 ఎన్నికల్లో ఆ పార్టీ నుంచి పోటీ చేసి జమ్మలమడుగులో ఓడిపోయారు.

అల ఓడగానే ఆయన బీజేపీలోకి జంప్ చేశారు. ప్రస్తుతం ఆయన బీజేపీలో ఉంటున్నా ఆయన 2024 ఎన్నికల వేళకు తిరిగి టీడీపీ గూటికి చేరుతారు అన్న ప్రచారం సాగుతోంది. దానికి కారణాలు కూడా ఉన్నాయి అంటున్నారు. అదేంటి అంటే ఆయన సోదరుడు కుమారుడు భూపెన్ రెడ్డి టీడీపీలో చేరారు. వచ్చే ఎన్నికల్లో ఆయన టీడీపీ నుంచి పోటీ చేస్తారు. ఆయన ఒక విధంగా ఆదినారాయణరెడ్డికి రాజకీయ వారసుడు కూడా అని అంటున్నారు.

దాంతో ఆయన కోసమైనా ఆదినారాయణరెడ్డి టీడీపీలోకి చేరవచ్చు అంటున్నారు. ఈ రకమైన కారణాల వల్లనే ఆయనకు బీజేపీ పెద్ద పీట వేయడంలేదని తెలుస్తోంది. ఈ మధ్యనే బీజేపీ ఏపీ విభాగానికి 12 మందితో కోర్ కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీలో టీడీపీ నుంచి బీజేపీలోకి జంప్ చేసిన ఎంపీలు సుజనా చౌదరి, సీఎం రమేష్ వంటి వారున్నారు కానీ ఏపీకి మంత్రిగా పనిచేసిన సీనియర్ మోస్ట్ నేత ఆదినారాయణరెడ్డి పేరు లేదు.

దాంతో అందరిలో ఒక్కసారిగా అనుమానాలు పెరిగిపోతున్నాయి. కావాలనే బీజేపీ ఆయన్ని పక్కన పెట్టిందా అన్న చర్చ కూడా సాగుతోంది. అవును మరి ఆదినారాయణరెడ్డి ట్రాక్ రికార్డు చూసుకున్నా కేవలం పదేళ్ల వ్యవధిలో నాలుగు పార్టీలు మారారు. మళ్లీ టీడీపీ వైపు వెళ్ళే పరిస్థితులు ఉన్నాయి. దీంతోనే ఆయన్ని నమ్ముకుంటే లాభం లేదు అన్న నిర్ణయానికి బీజేపీ వచ్చింది అంటున్నారు. అయితే జమ్మలమడుగులో ఈ రోజుకు బీజేపీ బలంగా ఉంది అంటే దానికి కారణం ఆదినారాయణరెడ్డి అనే అంటున్నారు. ఆయన కనుక తప్పుకుంటే అక్కడ బీజేపీ జెండా ఎగిరే సీన్ లేదు.

ఏది ఏమైనా ఆదినారాయనరెడ్డి మీద కమలానికి ఏవో అనుమానాలు ఉన్నాయని రాజకీయంగా చర్చ సాగుతోంది. అయితే అదేమీ లేదు, ఆదినారాయణరెడ్డి తనకు తానుగానే కోర్ కమిటీ మెంబర్ షిప్ వద్దు అనుకున్నారు అన్న ప్రచారాన్ని ఆయన అనుచరులు చేస్తున్నారు. మొత్తానికి ఆది నారాయణరెడ్డి మళ్ళీ సైకిల్ ఎక్కుతారు అన్నది కడప రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న మాట. చూడాలి మరి ఏం జరుగుతుందో.
Tags:    

Similar News