ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ పార్టీల అత్యుత్సాహం గురించి ఉత్సాహం గురించి ఆసక్తికర చర్చ సాగుతోంది. ఆంధ్రప్రదేశ్ లో సార్వత్రిక ఎన్నికల తర్వాత జరిగే మొట్టమొదటి ప్రత్యక్ష ఎన్నికైన పురపాలక ఎన్నికలు హడావుడి ప్రారంభానికి ముందే రాజకీయ వేడి ప్రారంభమైంది. అ మున్పిపల్ ఎన్నికల వేడి మొదలైంది. న్యాయస్ధానానికి గతంలో ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ఈ నవంబర్ మాసంలో రాష్ట్రంలోని 11 పురపాలక సంఘాలకు ఎన్నికలు జరగాలి. ఇందులో భాగంగానే ఆయా పురపాలక సంఘాల్లో ఓటర్ల నమోదు - జాబితాల సవరణ తదితరాలను ప్రభుత్వం వేగంగా చేయిస్తోంది.
అయితే అత్యంత కీలకం - ప్రాథమికమైన ఓటర్ల జాబితా కూడా వెలువడకముందే ఇప్పటి నుండే ఓటరు నాడి పట్టుకోవటానికి పార్టీలు పోటీ పడుతున్నాయి. ఇందులో భాగంగానే టెలిఫోన్ సర్వే మొదలైంది. ఏ పార్టీ చేయిస్తోందో లేక ఏ పార్టీ తరపున ఏ సంస్ధ చేస్తోందో స్పష్టత లేదుగానీ మొత్తానికి గడచిన వారం రోజులుగా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా టెలిఫోన్ సర్వే మాత్రం మొదలైంది. వేలాది మంది ఓటర్లకు ప్రతీ రోజు హైదరాబాద్ లోని 040 38399889 నెంబర్ నుండి ఇంటరాక్టివ్ వాయిస్ రికార్డు సిస్టమ్ (ఐవిఆర్ ఎస్) ద్వారా ఫోన్ వస్తోంది. రాబోయే ఎన్నికల్లో ఏ పార్టీకి ఓటు వేయదలుచుకున్నారన్న ప్రశ్నతో సర్వే మొదలౌతోంది. నేరుగా పార్టీ అధినేతల పేర్లతోనే సర్వే జరుతుండలం గమనార్హం. ఏపీ సీఎం చంద్రబాబునాయడుకు అయితే 1 నొక్కండని - ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అయితే 2 నొక్కండని - బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు హరిబాబుకు మద్దతివ్వాలనుకుంటే 3 నొక్కండని వాయిస్ వినిపిస్తోంది. అదే విధంగా - కాంగ్రెస్ - వామపక్షాలకు ఓట్లు వేయదలుచుకుంటే ఫలానా నెంబర్ నొక్కండని కూడా వాయిస్ లో వినిపిస్తోంది. దాంతో పాటుగా టీడీపీ-బీజేపీలు కలిసి పోటీ చేస్తే - మిత్రపక్షాలకు ఓట్లు వేస్తారా ? లేక వైసీపీకి ఓటు వేస్తారా అంటూ ఓటర్ల అభిప్రాయాలు కూడా సర్వేలో తెలుసుకుంటున్నారు. మరోవైపు ఓట్ల జాబితా ప్రతిపక్షాలు విమర్శలు మొదలుపెడుతున్నాయి. ప్రతిపక్షాలకు చెందిన ఓట్లను అధికార తెలుగుదేశం తొలగిస్తున్నట్లు వైసీపీతో పాటు ఇతర పక్షాలు ఆరోపణలు చేస్తున్నాయి.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/