అద్వానీ స‌హా మ‌రో ఇద్ద‌రిపై కుట్ర కేసు

Update: 2017-05-30 10:48 GMT
బాబ్రీ మ‌సీదు కూల్చివేత కేసులో బీజేపీ సీనియ‌ర్ నేత‌లు ఎల్‌ కే అద్వానీకి మ‌రో షాక్ త‌గిలింది. ఆయ‌న‌తో పాటు, ఉమాభార‌తి - ముర‌ళీమ‌నోహ‌ర్ జోషిల‌పై కుట్ర కేసు న‌మోదైంది. ఐపీసీ సెక్ష‌న్ 120(బి) కింద కేసు న‌మోదు చేశారు. నిందితులు దాఖ‌లు చేసిన‌ డిశ్చార్జ్ పిటిష‌న్‌ ను స్పెష‌ల్ సీబీఐ కోర్టు తోసిపుచ్చింది. ఈ ముగ్గురు నేత‌లు స‌హా 12 మంది నిందితుల‌పైనా కుట్ర కేసు న‌మోదైంది. అయితే ఈ కేసులో ఈ ముగ్గురు సీనియ‌ర్ నేత‌ల‌కు సొంత పూచీక‌త్తుపై కోర్టు బెయిల్ మంజూరు చేసిన విష‌యం తెలిసిందే.

ఇదిలాఉండ‌గా...బాబ్రీ మ‌సీదు కూల్చివేత కేసులో సీబీఐ కోర్టు ముందు హాజ‌ర‌య్యేందుకు ల‌క్నో వ‌చ్చిన సీనియ‌ర్ నేత అద్వానీకి యూపీ సీఎం యోగి ఆదిత్య‌నాథ్ స్వాగ‌తం ప‌లికారు. ల‌క్నో గెస్ట్‌ హౌజ్‌ కు వెళ్లిన యోగి పుష్ప‌గుచ్ఛం ఇచ్చి అద్వానీకి శుభాకాంక్ష‌లు చెప్పారు. బాబ్రీ మ‌సీదు కేసులో రెండ‌వ సారి అద్వానీ కోర్టు ముందు హాజ‌ర‌వుతున్నారు. అద్వానీతో పాటు ఉమాభార‌తి, ఎంఎం జోషిలు కూడా ల‌క్నో కోర్టుకు వ‌చ్చారు. బాబ్రీ కేసులో సీనియ‌ర్ బీజేపీ నేత‌లు నేరారోప‌ణ‌లు ఎదుర్కొంటున్నారు. ఇది కేవ‌లం న్యాయ ప్ర‌క్రియ మాత్ర‌మే అని, మా నేత‌లు అమాయ‌కులు అని, వాళ్లు స్వ‌చ్ఛంగా బ‌య‌ట‌కు వ‌స్తార‌ని కేంద్ర మంత్రి వెంక‌య్య‌నాయుడు అన్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News