రెండో డోస్ తీసుకున్న తర్వాత ఎందుకిలా అవుతుంది .. వైద్యులు ఏంచెప్తున్నారంటే ?

Update: 2021-05-02 02:30 GMT
దేశం మొత్తం కరోనా మహమ్మారి దెబ్బకి భయం తో వణికిపోతున్నారు. ఈ మహమ్మారి నుండి బయటపడటానికి ఉన్న ఏకైక మార్గం వ్యాక్సినేషన్ మాత్రమే. కానీ, చాలామంది వ్యాక్సిన్ పై పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. వ్యాక్సిన్ తీసుకున్న వారికి నీరసం, జ్వరం, దురదలు, నొప్పి.. వంటి సైడ్ ఎఫెక్ట్‌ లు వస్తున్నాయనేది వారి వాదన. ఇక సెకండ్ వేవ్ లో కరోనా దెబ్బకి జనాలు పిట్టల్లా రాలిపోతున్నారు. ఆక్సిజన్ లేక ఇబ్బందులు, ఆస్పత్రుల్లో బెడ్ల కోసం గొడవలు చూస్తుంటేనే దేశంలో ఏ పరిస్థితి ఉందొ అర్థమవుతోంది. ఇలాంటి పరిస్థితులను అదుపులోకి తీసుకొచ్చే ఒకే ఒక పద్ధతి వ్యాక్సినేషన్. ఇతర దేశాలు కూడా ఇదే పద్ధతిని ఫాలో అవుతున్నాయి.

ఇదిలా ఉంటే .. కరోనా మూడో వేవ్ వచ్చే ప్రమాదం ఉందంటూ కొందరు నిపుణులు హెచ్చరిస్తున్న ఈ సమయంలో  వ్యాక్సినేషన్ తప్పనిసరి. భారత్‌ లో ఇప్పుడు కనిపిస్తున్న దృశ్యాలు ప్రపంచంలో ఎక్కడైనా నెలకొనే ప్రమాదం ఉందని, కనుక ఏ దేశమూ కరోనా నిబంధనలు సడలించవద్దని డబ్ల్యు హెచ్ ఓ  చెప్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో కూడా వ్యాక్సిన్ తీసుకోవడానికి చాలా మంది సందేహిస్తున్నారు. వ్యాక్సిన్ తీసుకుంటే, అదీ రెండో డోసు తీసుకున్నప్పుడు నొప్పి, జ్వరం, బాధ, నీరసం, దద్దుర్లు వంటి లక్షణాలు కనిపిస్తున్నాయని బెదురుతున్నారు. నిపుణులు మాత్రం ఇలాంటి లక్షణాలు సర్వసాధారణం అంటున్నారు. ఎటువంటి టీకా తీసుకున్నా ఇలాంటి లక్షణాలు కనిపిస్తాయని చెప్తున్న వారు.. కరోనా విషయంలో ఇదేమీ ప్రత్యేకం కాదని చెప్తున్నారు.

రెండో డోసు వ్యాక్సిన్ తీసుకున్నప్పుడు సైడ్ ఎఫెక్ట్‌ లు మరింత తీవ్రంగా ఉండొచ్చు. కానీ దీనికి ఒక ముఖ్యమైన కారణం ఉంది. అయితే ఇలా సైడ్ ఎఫెక్ట్‌ లు రావడం అనేది మన శరీరం రక్షణను ఏర్పాటు చేసుకుంటుంద అనడానికి నిదర్శనాలు అని అమెరికాలోని సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ వర్గాలు వెల్లడించాయి. ఇక రెండో డోసు తీసుకునే సమయానికి శరీరంలో యాంటీబాడీల ఉత్పత్తి ప్రారంభమైపోతుంది. ఇలాంటి సమయంలో మరోసారి పాథోజెన్ కనిపించడంతో శరీరంలోని కణాలు దాన్ని గుర్తించి చాలా బలంగా రియాక్ట్ అవుతాయి. దీంతో మనలో కనిపించే సైడ్ ఎఫెక్ట్‌ ల తీవ్రత కూడా పెరుగుతుంది. ఇలా జరిగినప్పుడు తట్టుకోలేనంతగా ఇబ్బంది ఉంటే వైద్యుడిని సంప్రదించి బాధ, జ్వరం, ఒళ్లునొప్పుల వంటి సమస్యలకు మెడిసిన్స్ తీసుకుంటే సరిపోతుందని నిపుణులు వెల్లడించారు.
Tags:    

Similar News