కార్పొరేషన్ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. రాష్ట్రంలో మొత్తం 12 కార్పొరేషన్లు ఉన్నాయి. వీటిలో విశాఖ, విజయవాడలే కాకుండా.. నెల్లూరు కార్పొరేషన్ కూడా అత్యంత కీలకం. గత 2013 ఎన్నికల్లో ఈ కార్పొరేష న్‌ను వైసీపీ దక్కించుకుంది. మేయర్‌గా మైనార్టీ నేత అబ్దుల్ అజీజ్‌ను ఎన్నుకొన్నారు. అయితే.. తర్వాత కాలంలో ఆయన వైసీపీని వదిలి .. టీడీపీలోకి వెళ్లిపోయారు. గత ఎన్నికల్లో నెల్లూరు రూరల్ నియోజకవ ర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. ఇదిలావుంటే.. ఇప్పుడు మళ్లీ కార్పొరేషన్ ఎన్నికల వేడి పెరిగింది.
ప్రస్తుతం ఇద్దరు కీలక నాయకులు నెల్లూరు టీడీపీకి ఉన్నారు. మాజీ మంత్రి పి. నారాయణ, మాజీ మేయ ర్ అజీజ్. దీంతో ఇక్కడ కార్పొరేషన్‌లో ఈ దఫా అయినా.. పాగా వేయాలని టీడీపీ భావిస్తోంది. కానీ, సాధ్యమయ్యే పరిస్థితి కనిపించడం లేదని అంటున్నారు పరిశీలకులు. మొత్తం 54 వార్డులు ఉన్న కార్పొరేషన్‌లో జనాభా చాలా ఎక్కువగా ఉంది. పైగా..నెల్లూరు రూరల్, సిటీ ఎమ్మెల్యేలు.. ఇద్దరూ కూడా బలంగా ఉన్నారు. వైసీపీ దూకుడులో మంత్రి అనిల్ కుమార్ పాత్ర ఎక్కువగా ఉంది. దీంతో కార్పొరేషన్‌ను గెలిపించి.. సీఎం.. జగన్‌కు కానుకగా ఇస్తానని ఇటీవల ఆయన మీడియా మీటింగ్‌లోనే స్పష్టం చేయడం గమనార్హం.
ఈ తరహా ప్రతిజ్ఞ చేయడంలోను.. ఈ దిశగా పార్టీని నడిపించడంలోనూ టీడీపీలో ఎవరూ కనిపించకపోవ డం గమనార్హం. పైగా గ్రూపుల గోల ఎక్కువగా కనిపిస్తోంది. కార్పొరేషన్ పరిధిలో అజీజ్‌కు మంచి పట్టుంద ని అంటున్నారు. గతంలో మేయర్‌గా చేసి ఉండడంతో ఆయనకు ఇక్కడి ప్రజల నాడి తెలుసు. అయితే.. పార్టీలో కలిసి వచ్చే నాయకులు కనిపించడం లేదు. పైగా సుమారు 8 నుంచి 10 వార్డుల్లో పరిస్థితులు మారిపోయాయి. గత ఏడాది వార్డులకు నామినేషన్ వేసిన టీడీపీ అభ్యర్థులు ఇప్పుడు నామ్ కే వాస్తే.. అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. కరోనా నేపథ్యంలో వారు ఆర్థికంగా ఇబ్బందులు పడుతుండడంతో ప్రచారం కూడా అంతంత మాత్రంగానే ఉంది.
ఇక మేయర్ అభ్యర్థిపై క్లారిటీ లేదు. ఈ పరిణామాలు ఇలా ఉంటే.. వైసీపీలో మంత్రి అనిల్ అన్నీతానై చక్క బెడుతున్నారు. ఇక్కడ వైసీపీ గతంలో గెలుపు గుర్రం ఎక్కడానికి కూడా అప్పటి ఎమ్మెల్యే అనిలే కారణం. సో.. అదే హవాను కొనసాగించాలని అనిల్ దూకుడుగా ముందుకు సాగుతున్నారు. సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డివారు ఉన్నప్పటికీ.. జిల్లాలో ఉన్న పట్టు.. సిటీ.. కార్పొరేషన్‌లపై లేక పోవడం టీడీపీకి భారీ మైనస్. ఈ నేపథ్యంలో చంద్రబాబు ఇప్పటికైనా మేల్కొని సరైన దిశానిర్దేశం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని.. అంటున్నారు పరిశీలకులు.