ఎవరికైనా ఇంటికి రక్షణ ఉంటే తరువాత ఇంట్లో ఉన్న వారు ఏదైనా తిని బతుకుతారు. అలాంటిది ఈ దేశానికి రక్షణ విషయంలో ఎంతైనా ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉంది. ఇంత పెద్ద దేశం ఎన్నో సవాళ్ళను ఎదుర్కొంటున్న దేశానికి రక్షణ పరమైన అంశాలలో డబ్బు కోసం చూడకూడదు. కానీ బీజేపీ సంస్కరణలు ఎంత దూరం వచ్చాయీ అంటే దేశ రక్షణ విషయంలో కూడా రాజీ పడుతున్నారా అంటున్నారు ఆ రంగానికి చెందిన నిపుణులు.
భారత్ ఇపుడు అనేక సవాళ్ళను ఇంటా బయటా ఎదుర్కొంటోంది. పటిష్టమైన సైన్యం, అంకితభావం కలిగిన సైన్యం దేశానికి అవసరం. అంతే కాదు పార్ట్ టైమ్ జాబ్ లా చేసేందుకు కూడా కుదరదు. కానీ అగ్నిపధ్ పధకం చూస్తే కేవలం నాలుగేళ్ల కాలానికి యువతను తీసుకుని వారికి ఆ తీరున తర్ఫీదు ఇచ్చి వారి సేవలని పరిమిత కాలానికి మాత్రమే వాడుకుంటారు.
ఆ మీదట వచ్చిన వంద మందిలో డెబ్బై అయిదు మందికి తిరిగి వెనక్కు పంపుతారు. మరి వారు అతి పిన్న వయసులో వెనక్కి వస్తారు. మరి వారి సంగతేమిటి. వారి భవిత ఏంటి అన్నదే ఇపుడు చర్చ. అగ్గి వర్షాన్ని చిందించే యువ శక్తిని వాడుకోవడం వరకూ ఓకే అనుకున్నా కణకణమని మండుతున్న ఆ శక్తి దేశానికి మాత్రమే ఉపయోగపడాలి. అంతే కాదు వారి కోసం వారి శిక్షణ కోసం చేసే ప్రతీ పైసా కూడా వృధా కారాదు. కేవలం నాలుగేళ్ల కాలానికి కఠిన శిక్షణ ఇచ్చి వారిని వెనక్కి పంపిస్తే సైన్యంలో పనిచేసిన వారు తిరిగి వచ్చి ఏం చేయగలుగుతారు.
వారికి ప్రభుత్వ ఉద్యోగాలలో ప్రత్యేక కోటా ఇస్తామని, అలాగే వ్యాపారాలు చేసుకుంటే తగిన ఆర్ధిక సాయం చేస్తామని ప్రభుత్వం చెబుతోంది. ఒకసారి నెత్తురు మండించి దేశం కోసం రంగంలోకి దిగిన ఆ ఉడుకు రక్తం ఒక్క సారి చల్లబడి తగ్గిపోతుందా. ఏదో ఒక మూలన కూర్చుని వ్యాపారాలను, ఉద్యోగాలను చేసుకుంటుందా. ఇది పెద్ద ప్రశ్న.
ఇక ఇలాంటి యువతను ఉగ్రవాదులు ఆకట్టుకుంటే అపుడు సంగతేటి. దేశ రక్షణ కోసం తర్ఫీదు పొందిన యువ సిపాయిలు తప్పుడు మార్గంలోకి వెళ్తే వారిని అలా నడిపించిన పాపం నేపధ్యం ఎవరిది ఇవన్నీ ప్రశ్నలే. అంటే కేవలం పార్ట్ టైమ్ గా ఈ దేశానికి సేవ చేసి యువత అలా మిగిలిపోవడం వల్ల ఆయా సైనికులకు పెన్షన్ ఇతర పదవీ విరమణ కొరకు ఖర్చు చేయాల్సిన డబ్బు పరంగా చాలా ఆదా అవవచ్చు కానీ వెనక్కి తిరిగి చూస్తే మండే యువతను ఆపడం ఎవరి తరం కాదు, వారికీ అన్నీ నేర్పి పూర్తి కాలం వాడుకోకపోతే రేపటి రోజున వారే దేశానికి పెను ముప్పుగా మారినా మారుతారు.
ఇప్పటికే దేశం అంతర్గతంగా కూడా అనేక సమస్యలు ఎదుర్కొంటోంది. అందువల్ల సైనికులను తీసుకుంటే పూర్తి స్థాయిలో నిర్ణీత కాలానికి తీసుకోవాలి. అలా వారి సేవలను విజయవంతంగా దేశం కోసం వినియోగించుకోవాలి. ఒక వైపు చైనా రక్షణ కోసం చాలా ఖర్చు చేస్తోంది. డబ్బులు లేకపోయినా పాక్ కూడా ఈ విషయంలో ముందుంటోంది.
ఈ టైమ్ లో దేశభక్తి నిండుగా ఉందని చెప్పుకుంటున్న బీజేపీ ఇలాంటి ప్రయోగాలు చేయడం తగునా అన్న చర్చ వస్తోంది. అగ్నిపధ్ విషయంలో పునరాలోచన చేఅయలని మాజీ సైనిక అధికారులు సూచిస్తున్నారు. అలాగే యువతను దేశానికి సంపదగా చూడాలని కూడా కోరుతున్నారు. ఈ విషయంలో కేంద్రం వెనక్కి తగ్గాల్సి ఉంటుందేమో అని కూడా అంటున్నారు.
దేశ రక్షణ రంగం పటిష్టంగా ఉంచాల్సిన బాధ్యత అయితే ఏలికల మీద ఉంది. ఈ విషయంలో రాజీపడినా సైన్యాన్ని దైన్యంలోకి నెట్టినా భారీ మూల్యమే చెల్లించాల్సి ఉంటుందని ప్రతిపక్షాలు కూడా హెచ్చరిస్తున్నాయి. రాహుల్ గాంధీ అయితే అగ్గిలోకి దేశాన్ని నెట్టకండి అని బీజేపీ పెద్దల మీద మండిపడుతున్నారు.