కదిలిన డూమ్స్ డే గడియారం... వినాశనానికి చేరువైన ప్రపంచం!
అవును... భూమి క్రమంగా వినాశనానికి దగ్గరవుతున్నట్లు డూమ్స్ డే గడియారం తాజాగా హెచ్చరించిందని చెబుతున్నారు.
భూమి వినాశనానికి దగ్గరవుతుందా..? కొంతమంది చెబుతున్నట్లు కలియుగం త్వరలో అంతమవ్వబోతోందా..? చాలామంది భావిస్తున్నట్లు సృష్టి వినాశనానికి సమయం ఆసన్నమైందా..? అంటే.. చాలా మంది అవుననే అంటున్నారు. ఇప్పుడు తాజాగా డూమ్స్ డే గడియారం కూడా అదే హెచ్చరికలు జారీ చేసిందని చెబుతున్నారు.
అవును... భూమి క్రమంగా వినాశనానికి దగ్గరవుతున్నట్లు డూమ్స్ డే గడియారం తాజాగా హెచ్చరించిందని చెబుతున్నారు. అంతానికి ప్రపంచం ఎంత చేరువగా ఉందనే విషయాన్ని వివరించే ఈ గడియారం.. ప్రమాద సూచికకు మరింత చేరువైందని చెబుతున్నారు. తాజాగా.. బులిటెన్ ఆఫ్ అటామిక్ సైటిస్ట్స్ సంస్థ ఈ విషయాన్ని వెల్లడించింది.
ఈ మేరకు ఈ సంస్థ తాజాగా వార్షిక ప్రకటన చేసింది. ఇందులో భాగంగా.. అర్ధరాత్రి 12 గంటల సమయం వినాశనాన్ని సూచిస్తుండగా.. గత రెండేళ్లుగా ఈ గడియారం అర్ధరాత్రికి 90 సెకన్ల దూరంలో ఉండగా.. ఇప్పుడు అది అర్ధరాత్రికి 89 సెకన్ల దూరంలో ఉన్నట్లు తెలిపింది. ముప్పునకు ఇది ఇంత చేరువ కావడం ఇదే మొదటిసారని అంటున్నారు.
ఈ సందర్భంగా స్పందించిన శాస్త్రవేత్తలు.. వాతావరణ మార్పులు, పశ్చిమాసియాలో స్థిరత, మహమ్మారుల ముప్పు, అణ్వస్త్రాల వ్యాప్తి, సైనిక ఆపరేషన్లలో కృత్రిమ మేధను చొప్పించడం వంటివి తాజా పరిణామానికి కారణంగా చెబుతున్నారు. ఇదే సమయంలో... ప్రపంచంలోని ఏదో ఒక దేశం అణ్వస్త్ర వినియోగానికి దిగొచ్చని చెబుతున్నారు.
ఏది ఏమైనప్పటికీ.. ఈ గడియారం ప్రజలను భయాందోళనలకు గురి చేయడానికి ఉద్దేశించినది కాదని.. వారిని హెచ్చరించడానికి, అలర్ట్ చేయడానికి మాత్రమే ఉద్దేశించిందని నొక్కి చెబుతున్నారు.
కాగా... 1947లో బులిటెన్ సభ్యుడు మార్టిల్ లాంగ్ డోర్ఫ్ మానవ మనుగడ స్వీయ-వినాశనానికి ఎంత దగ్గరగా ఉందో సూచించడానికని ఈ ఐకానిక్ డూమ్స్ డే క్లాన్ ను సృష్టించారు. ఇది చికాగో యూనివర్శిటీ యొక్క హారిస్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ పాలసీలోని కెల్లర్ సెంటర్ లో ఉంది.