మళ్లీ ఆ పార్టీ నిర్ణయమే ఫైనల్.. కూటమిలో ఏం జరుగుతోంది.. ?
ఏపీలోని కూటమి ప్రభుత్వం మరోసారి కీలక నిర్ణయాన్ని బీజేపీ చేతిలోనే పెట్టడం ఆశ్చర్యం వేస్తోందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.;
ఏపీలోని కూటమి ప్రభుత్వం మరోసారి కీలక నిర్ణయాన్ని బీజేపీ చేతిలోనే పెట్టడం ఆశ్చర్యం వేస్తోందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. గతంలోనూ.. అనేక విషయాల్లో కేంద్రంలోని బీజేపీ తీసుకునే నిర్ణయానికి కట్టుబడి కూటమి పార్టీలైన టీడీపీ, జనసేన పనిచేశాయి. 2024 ఎన్నికల సమయంలో తమకు తాము కేటాయించుకున్న స్థానాల్లోనూ బీజేపీ సొంతం చేసుకుంది. ఆ తర్వాత.. చివరి నిముషంలో ప్రకటించిన అభ్యర్థులను పక్కన పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది.
కట్ చేస్తే.. ఇప్పుడు రెండు అంశాలు కూటమికి ప్రాణప్రదంగా మారాయి.
1) ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు.
2) వైసీపీ మాజీ సభ్యుడు విజయ సాయిరెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన రాజ్యసభకు అభ్యర్థి ఎంపిక.
ఈ రెండు అంశాలు కూడా.. కూటమికి ఇప్పుడు కీలకంగా మారాయి. అయితే.. ఈ విషయంలో ఎటూ తేల్చలేని పరిస్థితి ఏర్పడింది. వాస్తవానికి ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీల జాబితాలో ఒక సీటును జనసేనకు ఇచ్చి.. మిగిలిన నాలుగు స్థానాలను తమకు ఉంచుకోవాలని టీడీపీ ప్లాన్.
కానీ, ఇక్కడే బీజేపీ ఎంట్రీ ఇచ్చినట్టు తెలుస్తోంది. తమకు ఒక స్థానాన్ని రిజర్వ్ చేయాలంటూ.. సమాచారం ఇచ్చింది. దీంతో అప్పటి వరకు ఈ స్థానాలపై ఒక నిర్ణయానికి వచ్చిన కూటమి పార్టీలు డోలాయమా నంలో పడ్డాయి. ఫలితంగా ఇప్పుడు బీజేపీ తీసుకునే నిర్ణయం పైనే ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడిం ది. ప్రస్తుతం ఉన్న అంచనాల ప్రకారం.. బీజేపీ.. రాజ్యసభ సీటతోపాటు.. మండలిలో ఒక స్థానాన్ని కోరుతున్నట్టు సమాచారం. దీనిపై కూటమిలో కీలక నాయకుడి ద్వారా వర్తమానం కూడా పంపించింది.
అంటే.. మొత్తం ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాల్లో ఒకటి, రాజ్యసభ సీటు ఒకటి మొత్తంగా ఈ రెండు తమ కు కావాలంటూ.. కేంద్రంలోని బీజేపీ పెద్దలు ఇండెంట్ పెట్టారు. దీంతో ఈ వ్యవహారం ఇప్పుడు చర్చకు దారితీసింది. అయితే.. ఒక స్తానం ఏదైనా సరే.. ఇచ్చేందుకు టీడీపీ సిద్ధమైనట్టు తెలిసింది. అంటే.. ఒక రాజ్యసభ లేదా.. ఒక ఎమ్మెల్సీని బీజేపీకి ఇవ్వనున్నారు. తాజా ఢిల్లీ పర్యటనలో సీఎం చంద్రబాబు దీనిపై బీజేపీ పెద్దలతో చర్చించి.. ఒక నిర్ణయానికి రానున్నట్టు తెలిసింది.