వైసీపీ ఎమ్మెల్యేని దూరం పెట్టేస్తున్నారా ?

ఆయన గెలిచింది లగాయితూ ఏపీలో టీడీపీ కూటమి మీద విమర్శలు చేస్తూ వస్తున్నారు.;

Update: 2025-03-06 13:44 GMT

వైసీపీకి గట్టిగా ఉన్న వారే 11 మంది ఎమ్మెల్యేలు. అందులో జగన్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మరో ఇద్దరు తప్ప మిగిలిన వారు పెద్దగా మీడియాలో కనిపించరని చెబుతారు. ఇక తొలిసారి నెగ్గినా కూడా సోషల్ మీడియాలో రెగ్యులర్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉండేవారు ఎవరంటే ప్రకాశం జిల్లా ఎర్రగుండపాలెం కి చెందిన తాటిపర్తి చంద్రశేఖర్. ఆయన గెలిచింది లగాయితూ ఏపీలో టీడీపీ కూటమి మీద విమర్శలు చేస్తూ వస్తున్నారు.

పార్టీ తరఫున గట్టి వాయిస్ గా ఆయన నిలిచారు. ఆయన నియోజకవర్గంలో సొంత ఫాలోయింగ్ ని ఏర్పాటు చేసుకున్నారు. అలగే పార్టీ తరఫున కూడా పోరాడుతున్నారు. అయితే ఆయన ఇమేజ్ ఈ విధంగా పెరగడం సొంత పార్టీలోనే కొందరికి కంటగింపుగా మరిందని అంటున్నారు. ఆయనను పార్టీకి దూరం చేసేందుకు ప్రయత్నాలు కూడా స్టార్ట్ అయ్యారని అంటున్నారు.

వైసీపీని నిబద్ధతతో పనిచేసే చంద్రశేఖర్ లాంటి వారు ఈ టైం లో ఉండాల్సిన అవసరం ఉంది అని అంటున్నారు. ఆయన పార్టీ వాయిస్ ని బలంగా జనంలోకి తీసుకుని వెళ్తున్నారు. అలాగే కూటమి ప్రభుత్వం చేసే తప్పులను ఎండగడుతున్నారు. వైసీపీకి ఇపుడు అపొజిషన్ లో ఇలాంటి గొంతులు అవసరమని అంటున్నారు.

కానీ ఎందుకో ఆయనను టార్గెట్ చేశారు అని ప్రచారం సాగుతోంది. ఆయన సీటు నుంచి గతంలో పోటీ చేసిన ఒక మాజీ మంత్రి తిరిగి అక్కడికి రావాలని చూస్తున్నారని అందువల్ల ఇదంతా అని ఒక చర్చ ఉంది. దాంతో పాటుగా ఆయన సొంత ఇమేజ్ ని పెంచుకోవడం ఇష్టం లేని వారు కూడా అధినాయకత్వం తో ఆయనకు గ్యాప్ ని పెంచుతున్నారని అంటున్నారు.

దాని ఫలితమే ఆయన పార్టీ కండువా వేసుకోలేదని అధినాయకత్వం ఆయనను అనుమానించిందని వార్తలు కూడా వచ్చాయని అంటున్నారు. నిజానికి వైసీపీని వీడే పరిస్థితి అయితే ఆయనకు లేదనే అంటున్నారు. అయితే ఇటీవల కాలంలో ఆయన ప్రెస్ మీట్లు పెట్టుకునేందుకు కూడా పార్టీలో కొందరు అభ్యంతరం చెబుతూ అనుమతులు లేకుండా చేస్తున్నారని అంటున్నారు.

మరి ఇలాంటివి చేసి కట్టడి చేస్తే మాత్రం దూరం మరింతగా పెరుగుతునే ఉంటుందని అంటున్నారు. మరో వైపు చూస్తే సహజంగానే వైసీపీ ఎమ్మెల్యేల అసంతృప్తి మీద కన్నేసి కూటమి పెద్దలు అన్నీ చూస్తారని అంటున్నారు. ఈ విధంగా పరిస్థితులు ఉంటే కనుక ఆయనను తమ వైపునకు లాగేసే ప్రయత్నం చేసినా చేస్తారు అని అంటున్నారు.

ఇక వైసీపీ అధినేతతో నేరుగా కలసి మాట్లాడేంత పరిస్థితి లేకపోవడం వల్ల కూడా సదరు ఎమ్మెల్యేకు గ్యాప్ పెరుగుతోందని అంటున్నారు. ఇంతకీ ఆయనకు కావాలని దూరం పెడుతున్నారా లేక ఆయనే దూరంగా జరిగిపోవాలని చూస్తున్నారా లేక ఆయన మీద అనుమానాల మేఘాలు కురిపించి వేరేగా చిత్రీకరించాలని అనుకుంటున్నారా అంటే వేచి చూడాల్సిందే.

Tags:    

Similar News