తమిళనాట రాజకీయాలు ఎంత పోటాపోటీగా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మామూలు రోజుల సంగతిని పక్కన పెడితే.. తాజాగా ఆ రాష్ట్రంలో సాగుతున్న అసెంబ్లీ ఎన్నికల కారణంగా వాతావరణం మరింత వేడెక్కింది. పార్టీల మధ్య పోటాపోటీ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో ఈసారి ప్రభుత్వ ఏర్పాటుకు తాను కీలకం అవుతానని డీఎండీకే అధినేత విజయకాంత్ భావిస్తున్న సంగతి తెలిసిందే. తనను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించే పార్టీలతోనే జత కట్టేందుకు కిందామీదా పడిన ఆయన.. చివరకు కొన్ని తోకపార్టీల్ని వెంటేసుకోవటం తెలిసిందే.
తాజాగా ఆయన సతీమణి ప్రేమలత చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆమె మాట్లాడుతూ.. ప్రత్యర్థి పార్టీలు ఓటు వేసేందుకు డబ్బులు ఇచ్చే ప్రయత్నం చేస్తే.. వారి నుంచి రూ.2 వేలో.. రూ.3వేలో కాకుండా ఓటుకు లక్ష రూపాయిలు అడగాలని చెప్పి అందరూ ఉలిక్కిపడేలా చేశారు. తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలపై తమిళనాడు పోలీసులు స్పందించారు.
ప్రేమలత వ్యాఖ్యల్ని తమిళనాడు అధికారపక్షమైన అన్నాడీఎంకే నేతలు వీడియో తీసి.. పోలీసులకు చూపించి ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదుల్ని పరిగణలోకి తీసుకున్న తమిళనాడు పోలీసులు కెప్టెన్ సతీమణిపై కేసు నమోదు చేశారు. ఎన్నికల ప్రచారం ఆరంభంలోనే ఇంత హాట్ హాట్ వ్యాఖ్యలంటే.. రోజులు గడిచే కొద్దీ మరెన్ని వ్యాఖ్యలు తెరపైకి వస్తాయో..?