షాకింగ్ ఉదంతం చోటు చేసుకుంది. కేరళలోని కోజికోడ్ విమానాశ్రయంలో ఎయిరి ఇండియాకు చెందిన విమానం ఘోర ప్రమాదానికి గురైంది. దుబాయ్-కోల్ కతా వెళ్లే విమానం కోజికోడ్ ఎయిర్ పోర్టులో క్రాష్ అయ్యింది. దీంతో.. విమానం రెండు ముక్కలైంది. ముందు బాగం ఒక ముక్క..మిగిలిన భాగం ఒక ముక్కలగా చీలిపోయింది. ఈ ప్రమాదంలో పైలెట్ అక్కడికక్కడే మరణించారు.
వందే భారత్ మిషన్ లో భాగంగా దుబాయ్ నుంచి తీసుకొస్తున్న ఈ విమానంలో మొత్తం 191 మంది ప్రయాణికులు ఉన్నారు. కడపటి వార్తల ప్రకారం చూస్తే.. ఇద్దరు ప్రయాణికులు మరణించారని.. పలువురు గాయపడ్డారని చెబుతున్నారు. వీరిలో కొందరి పరిస్థితి సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తోంది.
రన్ వే మీద విమానం ల్యాండ్ అయ్యే సమయంలో స్కిడ్ అయినట్లుగా సమాచారం. ఈ రోజు రాత్రి 7.30 గంటల సమయంలో దుబాయ్ నుంచి వచ్చిన ఎయిరిండియా విమానం ఐఎక్స్ 344 ల్యాండ్అయ్యే సమయంలో ఈ ఘోరం చోటు చేసుకుంది. ఆ సమయంలో భారీగా వర్షం కురుస్తోందని చెబుతున్నారు. ఇంత ఘోర ప్రమాదంలోనూ అదృష్టం ఏమంటే.. రెండు ముక్కలైనప్పటికీ.. ఎలాంటి అగ్ని ప్రమాదం చోటు చేసుకోకపోవటంగా చెప్పాలి.
విమానంలో వర్షపు నీరు చేరుకున్న కారణంగానే విమానం క్రాష్ అయ్యిందని చెబుతున్నారు. ఈ దుర్ఘటనలో ఎంత మంది మరణించారు? ఎంతమంది గాయపడ్డారు? ఎంతమంది పరిస్థితి విషమంగా ఉందన్న వివరాలు తెలియరావాల్సి ఉంది. ఈ ప్రమాదం గురించి వార్తలు వస్తున్న సమయంలోనే సోషల్ మీడియాలో ఒక కీలక వ్యాఖ్య కనిపించింది. దుబాయ్ నుంచి వచ్చే విమానాలు భారత్ లో ప్రమాదానికి గురైన ఎక్కువ సందర్భాలు కేరళలోనే అని. ఇది నిజమైతే.. కాస్త ఆలోచించాల్సిన విషయమే.