ఎగిరిపోతే ఎంత బాగుంటుంది.. అని ఇంట్లో కూర్చొని పాటలు పాడుకునే వారికి కాస్త ఊరటనిచ్చే వార్త ఇదీ.. ఇన్నాళ్లు ఉదయం ఇండియాలో టిఫిన్.. మధ్యాహ్నం దుబాయ్ లో లంచ్ చేసే వారంతా కరోనా తెచ్చిన లాక్ డౌన్ తో ఇంటికే పరిమితమయ్యారు. ప్రధానంగా విదేశీయులు - విమానాల ద్వారానే కరోనా వ్యాపించడంతో అన్ని విమానాలు బంద్ అయిపోయాయి.
తాజాగా ఎయిర్ ఇండియా కీలక ప్రకటన చేసింది. దేశీయ ప్రయాణాలతోపాటు విదేశీ ప్రయాణాలకు మే 4 నుంచి టికెట్ బుకింగ్స్ చేసుకోవచ్చని సంచలన ప్రకటన చేసింది.విదేశీ ప్రయాణాలు మే 31 తర్వాత నుంచి పునరుద్దరిస్తామని తెలిపింది.
అయితే మొదట సెలెక్ట్ రూట్లకు మాత్రమే బుకింగ్స్ కల్పిస్తున్నామని ఎయిర్ ఇండియా తెలిపింది. ఇంటర్నేషనల్ విమానాలు కూడా జూన్ 1 నుంచి బుక్ చేసుకోవచ్చని తెలిపింది.
మార్చి 25న లాక్ డౌన్ కారణంగా భారత్ లో విమానాల రాకపోకలను నిషేధించారు. ఏప్రిల్ 14న లాక్ డౌన్ పొడిగించారు. ఈ సమయంలో మే 3 వరకు జాతీయ - అంతర్జాతీయ విమానాలు రద్దు అయ్యాయి. మే 4 నుంచి విమానాలు ప్రారంభం కానున్నాయి. అయితే మొదట దేశీయ - ఆ తర్వాత అంతర్జాతీయ సర్వీసులు నడుపుతారు.