కారు తో రైతుల్ని ఎక్కించి తొక్కేసి వీడియోలతో ఆ కేంద్రమంత్రి నే బ్లాక్ మెయిల్
ఒకడికి మించిన ఘనుడు మరొకడు ఉంటారంటారు. ఈ ఉదంతాన్ని చూస్తే.. ఈ మాట చప్పున గుర్తుకు రాక మానదు. దారుణ చర్యతో దేశ వ్యాప్తంగా ఒక్కసారిగా ఫేమస్ కావటమే కాదు.. మోడీ సర్కారుకు మచ్చగా మారిన ఉదంతాన్ని అంటకట్టిన ఘనుడిగా మారారు. మొనగాడు మోడీ.. అన్యాయాల్ని.. అక్రమాల్ని సహించడన్న పేరును తీసి పారేసేలా.. ఆయన సైతం పక్షపాతానికి కేరాఫ్ అడ్రస్ అన్న అపఖ్యాతిని మూటకట్టేలా చేసిన ఘనుడ్ని.. బ్లాక్ మొయిల్ చేసి డబ్బులు గుంజే వారు ఉంటారా?అంటే నో అనుకుంటాం. కానీ.. తాజా ఉదంతం మాత్రం ‘ఎస్’ అని చెబుతోంది. అసలేం జరిగందంటే..
స్వాతంత్య్రం వచ్చిన తర్వాత మరే కేంద్ర మంత్రి మీదా రాని రీతిలో వచ్చిన దారుణ ఆరోపణలు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ కుమార్ మిత్రా మీద రావటం తెలిసిందే. అక్టోబరు మూడున లఖింపూర్ భేరీలో రైతుల మీద నుంచి వాహనాల్ని దూసుకెళ్లేలా చేసిన ఉదంతంలో నలుగురు రైతులతో సహా ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయిన దారుణ ఘటన చోటు చేసుకున్న సంగతి తెలిసిందే.
ఒక కేంద్రమంత్రిగా వ్యవహరిస్తున్న నేత మీద ఇలాంటి నేరారోపణలు వచ్చిన వెంటనే.. సదరు నేతను ఇంటికి పంపించటం చూస్తాం. కానీ.. అందుకు భిన్నంగా ప్రధాని మోడీ మాత్రం ఆయన్ను అదే పదవిలోకొనసాగించటంపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. ఇదిలా ఉంటే.. కేంద్రమంత్రి అజయ్ కుమార్ మిశ్రాను కొందరు బ్లాక్ మొయిల్ చేశారట. తమ వద్ద లఖింపూర్ ఉదంతానికి సంబంధించిన వీడియోలు.. సాక్ష్యాలు ఉన్నాయని.. తాము డిమాండ్ చేసిన రూ.2.5 కోట్లు ఇస్తే వాటిని ఇచ్చేస్తామని చెప్పారట.
ఈ ఉదంతంపై కేంద్రసహాయమంత్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అంతే.. బెదిరింపులకు పాల్పడిన పలువురిని పోలీసులు తాజాగా అదుపులోకి తీసుకున్నారు. దీనికి సంబంధించి నొయిడాలో నలుగురిని.. ఢిల్లీలో ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. బెదిరింపు ఫోన్ కాల్స్ ను వాయిస్ ఓవర్ ఇంటర్నెట్ ప్రోటోకాల్ ద్వారా చేసినట్లు గుర్తించారు. మొత్తానికి అమాయక రైతులు ఉసురు తీసిన ముదురు మంత్రిని బ్లాక్ మొయిల్ చేయబోయి భంగపడటమే కాదు.. జైలు ఊచలు లెక్కిస్తున్నారు.