తండ్రి కంటే కొడుకే బెట‌రంట‌

Update: 2016-10-29 10:19 GMT
కుటుంబ క‌ల‌హాలు - అంత‌ర్గ‌త సంక్షోభంతో కునారిల్లిపోతున్న ఉత్తరప్రదేశ్‌ లో అధికార స‌మాజ్‌ వాదీ పార్టీ మ‌రోమారు ఆస‌క్తిక‌ర‌మైన వార్త‌తో తెర‌మీద‌కు వ‌చ్చింది. సమాజ్‌ వాదీ పార్టీ అధినేత - సీనియర్ నాయకుడు ములాయంసింగ్‌ యాదవ్ కన్నా ఆయన కొడుకు.. ప్రస్తుత ముఖ్యమంత్రి - యువ నేత అఖిలేశ్‌ యాదవ్ వైపే యూపీ ఓట‌ర్లు మొగ్గు చూపుతున్నారు. వచ్చే ఎన్నికల్లో ముఖ్యమంత్రి అభ్యర్థిత్వానికి ఆయనే సరైనవాడని భావిస్తున్నారు. సమాజ్‌ వాదీ పార్టీకి ఉన్న గూండా ఇమేజ్‌ ను చెరిపేయడానికి అఖిలేష్‌ ప్రయత్నిస్తున్నారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

యూపీలో అంతర్గత సమరం మొదలైన తర్వాత సెప్టెంబర్‌లో నిర్వహించిన ఒక సర్వేతో పాటుగా తాజాగా చేపట్టిన మరో సర్వే.. అఖిలేశ్‌ కు ఆదరణ అంతకంతకు పెరుగుతున్నదని స్పష్టం చేశాయి. యూపీలో మొత్తం 403 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 12,221 మందిని సర్వే చేయగా.. పార్టీ ఓటు బ్యాంకయిన ముస్లిములు - యాదవుల్లో ములాయం కన్నా అఖిలేశ్‌ కే భారీ మద్దతున్నట్లు వెల్లడయింది. ప్రజాదరణ విషయంలో అఖిలేష్ బాబాయి శివ్‌ పాల్ ఏమాత్రం సవాల్‌ గా నిలువలేరని తేలింది. పార్టీకి ఉన్న గూండా ముద్రను మార్చడానికి అఖిలేశ్ ప్రయత్నిస్తున్నారని 68శాతం మంది అభిప్రాయపడ్డారు. ములాయంతో పోలిస్తే అఖిలేష్ ప‌రిపాలన‌ - స‌మ‌ర్థ‌త‌ - పార్టీ - వివిధ అంశాల‌పై అవ‌గాహ‌న‌లో మెరుగ్గా ఉన్నార‌ని ఓట‌ర్లు భావిస్తున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News