తమిళనాడు ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండడంతో తమిళనాట పాలిటిక్స్ హీట్ ఎక్కాయి. ఈసారి డీఎంకే విజయం ఖాయమని.. స్టాలిన్ సీఎం అవుతాడన్న అంచనాల నడుమ బీజేపీ చిచ్చుపెట్టేలా రాజకీయాలు మొదలుపెట్టిందన్న వాదన వినిపిస్తోంది. లోక్ సభ ఎన్నికల్లో తమిళనాట స్టాలిన్ క్లీన్ స్వీప్ చేశారు. ఈ నేపథ్యంలోనే తమిళనాడులో రాజకీయాలను షేక్ చేసే పరిణామాలు చోటుచేసుకున్నాయి.
తమిళనాడు మాజీ సీఎం కరుణానిధి కుమారులైన స్టాలిన్, అళగిరి మధ్య వార్ మొదలైంది. అన్నాదమ్ముల సవాల్ తో డీఎంకే పార్టీలో అసమ్మతి అంటుకుంది. ఇప్పటికే డీఎంకే పార్టీ చీఫ్ గా కొనసాగుతున్న స్టాలిన్ కు చుక్కలు చూపించడానికి అతడి అన్న, మాజీ కేంద్రమంత్రి ఎంకే అళగిరి రంగం సిద్ధం చేసుకున్నట్టు పరిణామాలు సంభవిస్తున్నాయి. తనను డీఎంకేకు దూరం చేసిన తమ్ముడు స్టాలిన్ ను టార్గెట్ చేయడానికి అళగిరి అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది.
ఇంతకాలం మౌనం, స్తబ్దుగా ఉన్న అళగిరి సడన్ గా పార్టీ క్యాడర్ తో సమావేశం పెట్టాలని ఎందుకు అనుకున్నారు. కొత్త పార్టీ వైపు ఆయన ఎందుకు అడుగులు వేస్తున్నాడన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అయితే దీనివెనుక బీజేపీ హస్తం ఉందన్న ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి.
మరో ఆరు నెలల్లో తమిళనాడుకు అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి. అన్నాడీఎంకేను ఇప్పటికే చెప్పుచేతుల్లో పెట్టుకున్న బీజేపీ ఇప్పుడు ప్రతిపక్ష డీఎంకేను చీల్చడానికి ప్రయత్నిస్తోందన్న ప్రచారం సాగుతోంది. డీఎంకేలో వ్యతిరేక కూటమిని అక్కున చేర్చుకునే ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది.
డీఎంకే, కాంగ్రెస్ లలో కీలకనేతలపై ఆపరేషన్ ఆకర్ష్ ను బీజేపీ ప్రయోగిస్తోంది. ఇప్పటికే కాంగ్రెస్ నుంచి ఖుష్బూ బయటకు వచ్చి బీజేపీలో చేరారు. ఇప్పుడు స్టాలిన్ దూకుడుకు అడ్డుకట్ట వేయడానికి ఆయన అన్న అళిగిరిని రంగంలోకి దించాలనే ప్లాన్ చేసినట్టు సమాచారం.
ఇప్పటికే స్థానిక బీజేపీ నేతలు అళగిరితో సమావేశమయ్యారని ప్రచారం సాగుతోంది. ఈ నెల 21న తమిళనాడులో పర్యటించనున్న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాతో అళగిరి సమావేశం కాబోతున్నట్టు వార్తలు వెలువడుతున్నాయి. ఆయనతో సొంతంగా పార్టీ పెట్టించి, డీఎంకేకు వ్యతిరేకంగా ప్రచారం చేయించాలన్నది బీజేపీ వ్యూహంలో భాగమని చెబుతున్నారు.అన్నాదమ్ముల గొడవతో డీఎంకే చీలి ఎన్నికల్లో లాభం కలుగుతుందని బీజేపీ భావిస్తోంది.
ఇప్పటికే అళిగిరిని డీఎంకే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి నుంచి స్టాలిన్తొలగించారు. పార్టీని తన కంట్రోల్ లోకి తీసుకున్నారు. ఈ క్రమంలోనే తనను అవమానించి బయటకు పంపిన స్టాలిన్ పై ప్రతీకారం తీర్చుకోవడానికి సమయం ఆసన్నమైందని.. అళిగిరి వెనుక బీజేపీ ఉండి మొత్తం నడిపించబోతోందని తమిళరాజకీయాల్లో హా్ట్ హాట్ చర్చ సాగుతోంది. ఇప్పటికే దక్షిణ తమిళనాడులోని పది జిల్లాల పార్టీ క్యాడర్ అళగిరి మాట వింటుందని.. పార్టీలో చీలిక ఖాయం అని అంటున్నారు. ఇదే జరిగితే డీఎంకే చీలిపోయి బీజేపీ-అన్నాడీఎంకేకు లాభం జరుగనుందని తెలుస్తోంది.