దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కథువా ఘటన అనంతరం పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ఓ వైపు ఈ కేసును వేగంగా విచారణ అదే సమయంలో రాజకీయ దుమారం కూడా పెద్ద ఎత్తు నోటుచేసుకుంటుండటంతో పరిణామాలు సైతం రోజురోజుకు మారిపోతున్నాయి. ఇదే రీతిలో కీలక పరిణామం చోటుచేసుకున్నట్లు సమాచారం. కథువా నిందితులకు మద్దతుగా ఇద్దరు మంత్రులు రోడ్డెక్కిన నేపథ్యంలో బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే దీన్ని నిరసిస్తూ ఆ ఇద్దరితో పాటు మరో నలుగురు మంత్రులు తమ పదవులకు గుడ్‌బై చెప్పినట్లు జాతీయ మీడియాలో ప్రచారం జరుగుతోంది.
కథువా ఉదంతం క్రమంగా మతపరమైన వివాదంగా మారుతున్న నేపథ్యంలో జమ్మూకశ్మీర్ ప్రభుత్వం ఆచితూచి అడుగులు వేస్తోంది. మృతురాలు ముస్లిం బాలికకాగా - నిందితులందరూ హిందువులు. ఈ నేపథ్యంలో కతువా కేసు విచారణకు జమ్మూ ప్రభుత్వం సోమవారం ఇద్దరు సిక్కుమతస్థుల్ని పబ్లిక్ ప్రాసిక్యూటర్లుగా నియమించింది. ఇదే సమయంలో కీలక పరిణామం ఒకటి జాతీయ మీడియాలో వార్తగా వచ్చింది. జమ్మూకశ్మీర్ ప్రభుత్వంలోని ఆరుగురు బీజేపీ మంత్రులు రాజీనామా చేసినట్టుగా రెండు ప్రముఖ టీవీ ఛానల్లు కథనం ప్రసారం చేశాయి. దీన్ని సీఎం ముఫ్తీ మెహబూబా సైతం స్వాగతించారని పేర్కొంది. కశ్మీర్ లో బీజేపీ-పీడీపీ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. 87స్థానాలకు గాను పీడీపీ 28స్థానాలను - బీజేపీ 25స్థానాలను గెలుచుకుని.. పొత్తుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వాన్ని కాపాడుకోవాలనే యోచనతోనే మంత్రులతో బీజేపీ అధిష్టానం రాజీనామా చేయించిందనే ప్రచారం కూడా జరుగుతోంది.
మరోవైపు కథువా లైంగికదాడి - హత్య ఘటనకు సంబంధించి సుప్రీంకోర్టు సోమవారం కీలక ఆదేశాలు వెలువరించింది. బాధిత కుటుంబానికి - వారి తరఫు న్యాయవాదికి - అండగా నిలిచిన కుటుంబస్నేహితుడికి పూర్తి రక్షణ కల్పించాలని జమ్ముకశ్మీర్ ప్రభుత్వాన్ని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. అలాగే రాష్ట్రంలో విచారణను ప్రభావితం చేసే అవకాశం ఉన్నందున, కేసును చండీగఢ్ కోర్టుకు బదలాయించాలంటూ దాఖలైన పిటిషన్‌పై ఈనెల 27లోగా బదులివ్వాలని రాష్ట్రప్రభుత్వాన్ని సూచించింది.