ఏపీలో జగన్ని గద్దె దించాలి. ఇదీ చంద్రబాబు శపధం. ఆ విషయంలో ఆయన చేయాల్సినది అంతా చేస్తున్నారు. ఏకంగా ఢిల్లీ వేదికగా జగన్ సమక్షంలోనే తన రాజకీయ మంత్రాగానికి చంద్రబాబు తెర తీశారు. ఈ నెల 5న ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోడీ ఏర్పాటు చేసిన అఖిల పక్ష భేటీకి చంద్రబాబు హాజరవుతున్నారు. ఆ మీటింగ్ కి ఏపీ సీఎం జగన్ కూడా అటెండ్ అవుతున్నారు.
ఇలా చాలా కాలానికి బాబు జగన్ ఇద్దరూ ఢిల్లీ వేదికగా ఎదురెదురు పడనున్నారు. మరో వైపు చూస్తే ఈసారి ఢిల్లీ టూర్ తో మొత్తం గేం ని చేంజ్ చేయాలని చంద్రబాబు చూస్తున్నారు. ఈసారి కచ్చితంగా ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ కావడానికి బాబు అంతా సిద్ధం చేసుకున్నారు అని అంటున్నారు.
ఈ భేటీలో అనేక విషయాలు చర్చకు వస్తాయని తెలుస్తోంది. అదే విధంగా బీజేపీతో పొత్తులకు కూడా బాబు తెరతీయడం ద్వారా వైసీపీకి గట్టి రిటార్ట్ ఇస్తారు అని అంటున్నారు. ఏపీలో 2014 నాటి పొత్తులను రిపీట్ చేయాలని చూస్తున్న చంద్రబాబు ఢిల్లీ మీటింగ్ ని అందుకు అనువుగా ఉపయోగించుకోనున్నారు అని అంటున్నారు.
జగన్ మీద గెలిచేందుకు ఏ ఒక్క అవకాశాన్ని వదులుకోకూడదు అన్నదే చంద్రబాబు వ్యూహమని అంటున్నారు. ఇక గతంలో ఆజాదీ కా అమృతోత్సవ్ కార్యక్రమం కోసం ఢిల్లీ వెళిన చంద్రబాబు మోడీతో చేతులు కలిపారు. అలా సుదీర్ఘంగా కాలంగా ఏర్పడిన గ్యాప్ ని బాబు బాగా తగ్గించుకోగలిగారు అని అంటున్నారు. ఇపుడు మరో స్టెప్ ముందుకు వేసి ఏకంగా మోడీతో భేటీకే తెర తీయాలని చూస్తున్నారు.
ఈ భేటీ కనుక సాగితే ఏపీలో రాజకీయ పరిణామాలు మొత్తం మారిపోతాయని అంటున్నారు. ఒక్క దెబ్బకు రెండు పిట్టలు అన్నట్లుగా అటు ఏపీలో బీజేపీతో పొత్తు కుదుర్చుకోవడంతో పాటు వైసీపీకి కోలుకోలేని దెబ్బ తీయాలి అన్నదె బాబు విధానంగా కనిపిస్తోంది. జగన్ ఢిల్లీకు వస్తున్నారు. ఆయన ఎదురుగానే ఆయన చూస్తూండగానే మోడీతో తన రిలేషన్స్ ని పెంచుకుని హస్తిన వేదికగా దెబ్బ తీసేందుకు వ్యూహం రచిస్తున్నారు.
ఇక జగన్ మోడీతో భేటీ కి హాజరవుతారు. ఆ వెంటనే ఆయన తిరిగి వచ్చి కడప జిల్లా టూర్ కి వెళ్తారు. జగన్ ఢిల్లీని వీడి వచ్చినా కూడా బాబు ఎత్తుగడలను పరిశీలిస్తారు అని అంటున్నారు. బాబు రాజకీయాన్ని చూసి ఆ మీదట దాన్ని తిప్పి కొట్టే కౌంటర్ పాలిటిక్స్ కి జగన్ తెర తీస్తారు అని అంటున్నారు. మొత్తానికి ఈ ఇద్దరు నేతలు ఢిల్లీ వేదికగా ఏ రకమైన రాజకీయాన్ని అనుసరిస్తారు అన్నదే చూడాలి. ఇది ఆసక్తిని కూడా పెంచుతుంది.