సదావ‌ర్తిపై సుప్రీం తీర్పుపై ఆళ్ల రియాక్ష‌న్‌

Update: 2017-10-07 10:58 GMT
స‌దావ‌ర్తి భూముల‌పై ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుకు త‌గిలిన ఎదురుదెబ్బ‌లు చాలానేన‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. స‌దావ‌ర్తి భూముల విష‌యంలో మింగా లేక క‌క్కాలేని ప‌రిస్థితిని ఆయ‌న ఎదుర్కొన్న‌ట్లుగా చెబుతున్నారు. ఈ భూములు ఎవ‌రివో తేల్చాలంటూ అత్యున్న‌త న్యాయ‌స్థానం సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల‌పై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆళ్ల రామ‌కృష్ణారెడ్డి హర్షం వ్య‌క్తం చేశారు.

తాజాగా మీడియాలో మాట్లాడిన సంద‌ర్భంగా స‌దావ‌ర్తి భూముల‌పై ఏపీ సీఎం చంద్ర‌బాబు తీరును తీవ్రంగా త‌ప్పు ప‌ట్టారు. సదావ‌ర్తిపై సుప్రీంతీర్పును తాము స్వాగ‌తిస్తున్న‌ట్లుగా చెప్పారు. కేవ‌లం భూముల్ని కాజేసేందుకే చంద్ర‌బాబు సుప్రీంకు వెళ్లిన‌ట్లుగా ఆళ్ల ఆరోపించారు.

త‌న బినామీల సాయంతో స‌దావ‌ర్తి భూముల్ని కాజేసేందుకు చంద్ర‌బాబు ప్ర‌య‌త్నించార‌న్నారు. ద‌మ్ముంటే ఇందుకోసం సొంత డ‌బ్బులు క‌ట్టాల‌ని స‌వాలు విసిరారు. ఇప్ప‌టికే క‌ట్టిన డ‌బ్బు గురించి బాబు బినామీలు ఆయ‌న్ను అడుగుతున్నార‌ని.. ప్ర‌జ‌ల ఆస్తిని చివ‌ర‌కు వ‌డ్డీల రూపంలో చంద్ర‌బాబు చెల్లిస్తున్నార‌న్నారు. ఒక‌వేళ కోర్టు ఆదేశాలు కానీ వ‌డ్డీ క‌ట్టాల‌ని చెబితే మాత్రం.. ఆ మొత్తాన్ని ప్ర‌జాధ‌నంతో కాకుండా చంద్ర‌బాబు సొంత డ‌బ్బులో నుంచి చెల్లించాల‌ని డిమాండ్ చేశారు.

దేవాదాయ భూముల్ని అమ్మ‌కూడ‌ద‌న్న జీవోను ఏపీ స‌ర్కారు జారీ చేస్తే బాగుంటుంద‌న్న ఆయ‌న‌.. త‌మిళ‌నాడు స‌ర్కారుకు స‌దావ‌ర్తి విష‌యంలో ధీటుగా స‌మాధానం ఇవ్వాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. ఆర్కే సంధించిన స‌దావ‌ర్తి సందేహాల‌పై బాబు క్లారిటీ ఇచ్చే బాగుంటుంది.
Tags:    

Similar News