జ‌య‌ప్ర‌ద శ‌త్రువుకు ఝ‌ల‌క్..!

Update: 2019-12-17 01:30 GMT
ఉత్త‌రాదిన న‌టి జ‌య‌ప్ర‌ద‌కు ఒకే ఒక ప్ర‌ముఖ శ‌త్రువు ఉన్నాడు. అత‌డే ఆజాంఖాన్. గ‌తంలో జ‌య‌ప్ర‌ద సమాజ్ వాదీ పార్టీలో ప‌ని చేశారు. అప్పుడంతా బాగానే ఉండేది. అయితే ఆ పార్టీకి జ‌య‌ప్రద దూరం అయ్యాకా క‌థ మారింది. ఈమె ఎస్పీలో ఉన్న‌ప్పుడు రాంపూర్ లో జ‌య‌ప్ర‌ద‌కు ప్రాతినిధ్యం ద‌క్క‌డంలో ఆజాంఖాన్ దే కీల‌క పాత్ర అంటారు.

జ‌య‌ప్ర‌ద స‌మాజ్ వాదీ పార్టీకి దూరం అయ్యాకా.. ఆ పార్టీ ఫ‌స్ట్ ఫ్యామిలీతో ఆమెకు పెద్ద‌గా విబేధాలు లేవు. ములాయం అయినా - అఖిలేష్ అయినా ఆమెతో పెద్ద‌గా వాదోప‌వాదాల‌కు దిగారు. ఆమెను ఏమీ దూషించరు కూడా.

అయితే ఎటొచ్చీ ఆజాం ఖాన్ వ‌ర్సెస్ జ‌య‌ప్ర‌ద పోరాటం మాత్రం సాగుతూనే ఉంది. ఇటీవ‌లి లోక్ స‌భ ఎన్నిక‌ల స‌మ‌యంలో కూడా ఆజాంఖాన్ ఆ న‌టీమ‌ణిపై తీవ్ర వ్యాఖ్య‌లు చేశాడు. ఆమె ఖాకీ నిక్క‌ర్ వేసుకున్న విష‌యం త‌న‌కు ఎప్పుడో తెలుసంటూ ఆజాంఖాన్ చేసిన వ్యాఖ్య‌లు తీవ్ర వివాదాస్ప‌దం అయ్యాయి. ఆ విష‌యంలో ఆయ‌న ఈసీ నోటీసులు కూడా ఎదుర్కొనాల్సి వ‌చ్చింది.

అయితే జ‌య‌ప్ర‌ద ఎన్నిక‌ల్లో ఎంపీగా పోటీ చేసి ఓట‌మి పాలైంది. ఆ సంగ‌త‌లా ఉంటే.. ఇప్పుడు ఆజాంఖాన్ త‌న‌యుడికి ఝ‌ల‌క్ త‌గిలింది. ఆయ‌న త‌న‌యుడు ఎమ్మెల్యేగా అన‌ర్హుడు అయ్యాడు. త‌ప్పుడు వ‌య‌సు ధ్రువీక‌ర‌ణ ప‌త్రాల‌ను చూపించి అత‌డు ఎన్నిక‌ల్లో పోటీ చేశాడ‌ట‌. అందుకే అత‌డిని ఎమ్మెల్యే అన‌ర్హుడుగా ప్ర‌క‌టించింది కోర్టు. యూపీ అసెంబ్లీ ఎన్నిక‌ల‌ప్పుడు క‌నీస పోటీ వ‌య‌సు అయిన పాతికేళ్లు కూడా లేక‌పోయినా - త‌న‌కు ఆ వ‌య‌సు ఉన్న‌ట్టుగా చూపించింది ఆజాం ఖాన్ కొడుకు ఎమ్మెల్యేగా పోటీ చేసిన విష‌యం ఇప్పుడు బ‌య‌ట‌ప‌డిన‌ట్టుగా తెలుస్తోంది. అత‌డిపై అన‌ర్హ‌త వేటు నేప‌థ్యంలో అక్క‌డ ఉప ఎన్నిక‌లు త‌ప్ప‌నిసరిగా మారిన‌ట్టుగాన్నాయి.
Tags:    

Similar News