మున్సిపల్ శాఖకు వార్నింగ్ ఇచ్చిన అమల

Update: 2018-06-15 07:40 GMT
తెలుగు టాప్ హీరో నాగార్జున భార్య అమల బ్లూ క్రాస్ ఫౌండర్ గా కూడా సేవలందిస్తున్న సంగతి తెలిసిందే.. ఈమె జంతు సంరక్షణ పట్ల విశేష సేవలందిస్తున్నారు.  అయితే ఇటీవల తెలంగాణలోని మున్సిపాలిటీల్లో పెరిగిపోయిన ఊరకుక్కలను మున్సిపాల్టీ సిబ్బంది విచక్షణ రహితంగా చంపడంపై అక్కినేని అమల ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా అమల తెలంగాణ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రిన్సిపల్ సెక్రెటరీ అరవింద్ కుమార్ ను కలిసి మూగ అమాయకపు జీవులను చంపడం దారుణమంటూ ఫిర్యాదు చేశారు. కుక్కలను చంపడం జంతుసంరక్షణ చట్టం ప్రకారం నేరమవుతుందని హెచ్చరించారు.

అంతేకాదు కుక్కలను చంపకుండా వారి సంతాన వృద్ధి కాకుండా చర్యలు చేపట్టాలని.. కుక్కలకు సంతాన సామర్థ్యాన్ని తీసేయాలని ఆమె అధికారులకు సూచించారు. ఈ విషయంలో బ్లూ క్రాస్ సొసైటీ తరుఫున ప్రభుత్వానికి తాము సాయపడతామని ఆమె సూచించారు.

దీనికి స్పందించిన ఉన్నతాధికారులు వెంటనే ప్రభుత్వ అధికారులకు ఆదేశాలిచ్చారు. పశువైద్య సిబ్బందితో కలిసి కుక్కలకు సంతానోత్పత్తి కాకుండా ఆపరేషన్లు చేయించాలని సూచించారు. గల్లీలో ఉన్న కుక్కలను పట్టుకొని ఆపరేషన్లు చేయాలని ఆదేశించారు. ఇలా అమల చేసిన పనికి కుక్కలు బతికి పోయాయి.
Tags:    

Similar News