ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తే.. కేంద్రం వెల్ల‌డి

Update: 2022-02-02 09:08 GMT
ఏపీ రాజధాని విష‌యంలో ఇప్ప‌టి వ‌ర‌కు గోడ‌మీద పిల్లి మాదిరిగా వ్య‌వ‌హ‌రించిన కేంద్ర ప్ర‌భుత్వం .. తాజాగా క్లారిటీ ఇచ్చింది. ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తేన‌ని.. తేల్చి చెప్పింది. అమరావతే రాష్ట్రానికి రాజధాని అని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. రాజ్యసభలో బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు అడిగిన ప్రశ్నకు హోంశాఖ సహాయమంత్రి నిత్యానందరాయ్ సమాధానం ఇచ్చారు. అయితే.. రాజధాని నిర్ణయించే అధికారం రాష్ట్రానిదే అని చెప్పారు.

మూడు రాజధానులపై రాష్ట్ర ప్రభుత్వం వెనక్కు తగ్గినట్లు తమ దృష్టికి వచ్చిందని.. కనుక ప్రస్తుతం అమరావతే ఆంధ్రప్రదేశ్ రాజధాని అని స్పష్టం చేశారు. దీంతో ప్ర‌స్తుతానికి ఏపీకి అమ‌రావ‌తే రాజ‌ధానిగా ఉంటుంద‌న్నారు. ఈ ప‌రిణామం... అమ‌రావ‌తి రైతుల‌కు భారీ ఉప‌శ‌మ‌నంగా మారుతుంద‌న‌డంలో సందేహం లేదు. నిజానికి గ‌డిచిన రెండేళ్ల‌కు పైగా కేంద్ర ప్ర‌భుత్వం ఈ విష‌యంలో త‌ర్జ‌న భ‌ర్జ‌న ప‌డుతోంది. రాజధాని నిర్ణ‌యం త‌మ‌ది కాద‌ని. త‌మ‌కు సంబంధం లేద‌ని.. ప‌దే ప‌దే చెబుతున్న కేంద్రం.. ఒకానొక ద‌శ‌లో మూడు రాజ‌ధానుల‌ని కూడా వాదించింది.

ఇక‌, జియోగ్రాఫిక్ మ్యాప్‌లోనూ.. రాజధాని అమ‌రావ‌తిని ప్ర‌స్తావించ‌కుండా. విశాఖ‌ను రాజ‌ధాని అని పేర్కొన‌డం.. కొన్నాళ్ల కింద‌టే.. వివాదం అయింది. ఇక‌, ఈ విష‌యంలో టీడీపీ ఎంపీలు... బీజేపీ ఎంపీలు... స‌హా అనేక మంది పార్ల‌మెంటులో గ‌తంలో ప్ర‌శ్నించారు. ఆయా స‌మయాల్లోనూ.. ఏపీ రాజ‌ధాని విష‌యంలో అమ‌రావ‌తి కాద‌ని.. రాష్ట్ర ప్ర‌భుత్వం తీర్మానం చేసింద‌ని.. సో.. రాష్ట్ర ప్ర‌భుత్వ నిర్ణ‌యం మేర‌కు.. కేంద్రం రాజ‌ధానిని గుర్తిస్తుంద‌ని తెలిపింది. దీంతో ఇటు రాష్ట్రంతోపాటు.. అటు కేంద్రంపైనా విమ‌ర్శ‌లు వ‌చ్చాయి.

అయితే.. అనూహ్యంగా ఇప్పుడు కేంద్రం త‌న టంగ్ మార్చుకుంది. రాజ‌ధాని అమ‌రావ‌తేన‌ని ప్ర‌క‌టించిం ది. దీంతో రాజ‌ధానిగా అమ‌రావ‌తి ఉండాల‌ని కోరుకునే వారికి ఈ ప్ర‌క‌ట‌న మంచి ఉప‌శ‌మ‌నం క‌లిగించిం ది.

 అయితే.. ఇక్క‌డ ఒక స‌మ‌స్య ఉంది. రాష్ట్ర ప్ర‌భుత్వం మూడు రాజ‌ధానుల‌పై వెన‌క్కి త‌గ్గినందున అని కేంద్రం చెప్పింది. సో.. రేపు మ‌ళ్లీ మూడురాజ‌ధానుల విష‌యం వ‌స్తే.. అప్పుడు కేంద్రం ఏంచేస్తుంద‌నేది ప్ర‌ధాన ప్ర‌శ్న‌గా మారింది. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి. ఇప్ప‌టికైతే.. ఉప‌శ‌మ‌నం క‌లిగిన‌ట్టేన‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.


Tags:    

Similar News