పావు గంటలో అతడి ఆస్తి రూ.94వేల కోట్లు పెరిగింది

Update: 2020-01-31 10:00 GMT
కోటి రూపాయిల మొత్తం. ఒక వ్యక్తి జీవితం కాలంలో కూడా సంపాదించలేనోళ్లు కొన్ని కోట్ల మంది ఈ భూ ప్రపంచంలో ఉంటారు. అందుకు భిన్నంగా కేవలం గంటల్లో కోట్లు సంపాదించేటోళ్లు ఉంటారు. తాజాగా అలాంటి రికార్డుల్ని బద్ధలు కొడుతూ..కేవలం పదిహేను నిమిషాల వ్యవధిలో రూ.94 వేల కోట్లు సంపాదించిన వైనం తాజాగా చోటు చేసుకుంది. నమ్మశక్యంగా అనిపించకున్నా ఇది నిజం.

కేవలం పదిహేనను నిమిషాల వ్యవధిలో అమెజాన్ అధిపతి జెఫ్ బెజోస్ సంపాదనకు మరో రూ.94వేల కోట్లు అదనంగా వచ్చి చేరింది. ఇదెలా సాధ్యమైందన్నది చూస్తే.. ఈ - కామార్స్ దిగ్గజ సంస్థ అయిన అమెజాన్ తన నాలుగో త్రైమాసిక ఫలితాల్ని వెల్లడించింది. ఇందులో అమెజాన్ లాభం 8శాతం పెరిగినట్లుగా సంస్థ ప్రకటించింది. అంతే.. అప్పటివరకూ ఉత్కంఠగా ఎదురుచూస్తున్న వారంతా ఒక్కసారిగా అమెజాన్ షేర్ల కొనుగోలుకు ఎగబడటంతో స్టాక్స్ పుంజుకున్నాయి. క్షణాల వ్యవధిలో షేరు ఒక్కొక్కటి 2,100 డాలర్లకు చేరుకుంది.

Amazon.com Inc షేర్ ధర దూసుకెళ్లటంతో అమెజాన్ అధిపతి జెఫ్ బెజోస్ సంపాదన కూడా భారీగా పెరిగింది. కేవలం 15 నిమిషాల వ్యవధిలో అతడి సంపదకు మరో 94వేల కోట్ల రూపాయిలు అదనంగా వచ్చి చేరింది. 56 ఏళ్ల జెఫ్ బెజోస్ ఇప్పటికే ప్రపంచంలోనే ధనవంతుడు. ఇప్పటికే పలు రికార్డులు సృష్టిస్తున్న అతగాడు.. తాజాగా పెరిగిన షేరు ధరతో అతడి సంపాదన భారీగా పెరిగింది. తాజాగా పెరిగిన షేరు ధరతో అతడి ఆస్తి ఏకంగా రూ.9లక్షల కోట్లకు చేరుకోవటం విశేషం.


Tags:    

Similar News