అమెజాన్ సీఈవో వైర‌ల్ ట్వీట్‌!

Update: 2017-06-18 10:51 GMT
ధ‌న‌వంతులంద‌రికీ ద‌యా గుణం ఉండ‌దు. స‌మాజ సేవ చేయాల‌న్న ఆలోచ‌న కూడా కొద్దిమంది బిలియ‌నీర్ల‌కే ఉంటుంది. అయితే, అమెజాన్ సీఈవో జెఫ్ బీజోస్ త‌న దాన‌గుణంతో పాటు సింప్లిసిటీనీ చాటుకున్నారు. తాను విరాళంగా ఇవ్వాల‌నుకుంటున్న డ‌బ్బును దేనికోసం ఖర్చు చేస్తే బాగుంటుందో చెప్పాల‌ని నెటిజ‌న్ల స‌ల‌హా కోరారు.

ప్రపంచ బిలియనీర్లలో ఒకరైన జెఫ్ బీజోస్ చేసిన ట్వీట్ ఇపుడు వైర‌ల్ గా మారింది. తాను భారీ మొత్తంలో న‌గ‌దును విరాళంగా ఇవ్వాలనుకుంటున్నానని, ఆ డ‌బ్బు దేనికోసం ఖర్చు చేస్తే బాగుంటుందో చెప్పాలని నెటిజెన్స్ ను కోరారు. ఇంకేముంది,  ఆయన ట్వీట్ చేసిన కొద్దిసేప‌టికే  15వేల మంది నెటిజెన్స్ త‌మ స్పంద‌న‌లు తెలిపారు.
10వేల లైక్స్ - 15వేల రిప్లైలతో ఈ ట్వీట్ ట్విట్టర్ లో జోరుగా దూసుకెళ్తోంది

జెఫ్ తన సంపాదనలో సింహ‌భాగం దానాలకు వినియోగిస్తున్నారు. ఇటువంటి కార్యక్రమాలు మరిన్ని చేయాలన్న ఉద్దేశంతోనే నెటిజెన్స్ నుంచి స‌ల‌హాలు కోరారు.సంపూర్ణ ప్రభావం చూపించేలా, శాశ్వత పరిష్కారం కలిగించేలా..ప్రజలకు ఏదైనా చేయాలనుకుంటున్నానని ఆయన అన్నారు.

అంతేకాదండోయ్‌, ఒక వేళ‌ ఇలా ప్రకటించడం తప్పని ఎవ‌ర‌న్నా భావిస్తే.. ఆ విషయాన్ని ఫ్రాంక్‌ గా చెప్పాలని కోర‌డం విశేషం. దీనిపై పలువురు నెటిజెన్స్ స్పందించారు. అమెరికాలో విద్యకు చాలామంది దూరమవుతున్నారని, ఎక్కువమంది నిరాశ్రయులుగా ఉన్నారని..  అటువంటి వారికి సహాయం చేయాలని కోరారు. విద్యార్థుల విద్యా రుణాలను తీరిస్తే బాగుంటుందని మ‌రికొంత‌మంది సలహా ఇచ్చారు. మ‌రి నెటిజ‌న్ల స‌ల‌హాల‌ను జెఫ్ ఎంత‌వ‌ర‌కు స్వీక‌రిస్తారో వేచి చూడాలి మ‌రి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News