అంబానీ.. లాస్ట్ బిల్డింగ్ కూడా అమ్మేసుకున్నాడు!

Update: 2021-04-01 13:30 GMT
ఓ వైపు అన్నయ్య ముఖేష్ అంబానీ రోజురోజుకు సంపద పోగేసుకొని భారతదేశంలోనే నంబర్ 1 ధనవంతుడిగా ఎదిగాడు. ఆసియాలోనూ నంబర్ 1 స్థాయికి చేరుకున్నాడు. కానీ తమ్ముడు అనిల్ అంబానీ మాత్రం కంపెనీలతో నష్టపోయి చేసిన అప్పులు తీర్చేందుకు ముంబైలోని విలువైన తన స్థలాలను తెగనమ్ముకుంటున్న దుస్థితికి దిగజారాడు.

పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయిన అనిల్ అంబానీ ఇప్పుడు తన అప్పులు తీర్చేందుకు ఆస్తులను అమ్మేస్తున్నాడు. తన నేతృత్వంలోని రిలయన్స్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ప్రధాన ఆస్తిని తాజాగా విక్రయించారు. ప్రైవేటు రంగ బ్యాంకు యస్ బ్యాంకు అప్పు తీర్చే పనిలో భాగంగా తన వేలకోట్ల ఆస్తిని అంబానీ విక్రయించారు.

యస్ బ్యాంకుకు బకాయిపడిన కోట్ల రూపాయల అప్పును తీర్చేందుకు ముంబైలోని రిలయన్స్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ముంబై ప్రధాన కార్యాలయం ‘రిలయన్స్ సెంటర్’ను అనిల్ అంబానీ అమ్మేశాడు. ఈ పరిణామంతో స్టాక్ మార్కెట్ లో రిలయన్స్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ షేరు దాదాపు 9.50శాతం పెరగడం విశేషం.

యస్ బ్యాంకు రుణాన్ని తిరిగి చెల్లించేందుకు ఉద్దేశించిన ఈ లావాదేవీ విలువ రూ.1200 కోట్లు అని తెలిపారు. ఈ అమ్మకంతో బ్యాంక్ ఇదే ఆఫీస్ ను తన కార్పొరేట్ హెడ్ క్వార్టర్ గా మార్చుకోనుంది.

2021 జనవరిలో ఇన్ ఫ్రాసక్ట్చర్ మొత్తం 3 ఆస్తులను విక్రయించింది. ఢిల్లీ ఆగ్రా  టోల్ రోడ్ ఆస్తిని 3600 కోట్లకు, పర్బతి కోల్డామ్ ట్రాన్స్ మిషన్ ను 900 కోట్లకు విక్రయించి అప్పులు తీర్చేశాడు అనిల్ అంబానీ. ఇలా అన్న ఎదుగుతుంటే తమ్ముడు అప్పులు తీర్చే పనిలో బిజీగా ఉన్నారు.
Tags:    

Similar News