ప్రజాజీవితంలో ఉన్న వారు ఆచితూచి అడుగులు వేయాలి. కానీ.. అలాంటివేమీ పట్టకుండా వ్యవహరించిన వారు త్వరితగతిన పేరు ప్రఖ్యాతుల్ని పోగొట్టుకుంటారు. తమకున్న గౌరవ మర్యాదల్ని చేజేతులారా చేజార్చుకునే తీరు చూసినప్పుడు అంత పెద్ద మనుషులకు ఇంత చిన్న విషయాలు ఎందుకు పట్టవన్న సందేహం రాక మానదు. సీనియర్ నటుడు.. కర్ణాటక అధికారపార్టీ ఎమ్మెల్యే అంబరీష్ తాజాగా ఒక వివాదంలో ఇరుక్కుపోయారు.
గడిచిన కొద్దిరోజులుగా కర్ణాటక అసెంబ్లీ సమావేశాలు వాడీవేడిగా సాగుతున్నాయి. డీఎస్పీ గణపతి సూసైడ్ కేసు అసెంబ్లీలో వాద ప్రతివాదాలకు దారి తీసింది. అధికారపక్షం తీరును విపక్షాలు ఎండగడుతున్నాయి. ఇలాంటి వేళ.. సభలో అధికారపక్షానికి అండగా ఉండాల్సిన అంబరీష.. అందుకు భిన్నంగా డ్యాన్సులు వేసిన వైనం విమర్శల పాలయ్యేలా చేసింది.
బాధ్యతాయుతమైన ఎమ్మెల్యేగా ఉన్న ఆయన సభకు హాజరు కాకుండా.. ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొని.. యువతులతో సరదాగా డ్యాన్సులు వేసిన తీరు తీవ్ర విమర్శలకు తావిస్తోంది. డీఎస్పీ గణపతి సూసైడ్ కేసులో ఏ1గా మంత్రి కేజే జార్జ్ ను సీబీఐ పేర్కొనటం.. ఆయన తన పదవికి రాజీనామా చేయాలంటూ విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.
ఇలాంటి వేళ.. సభకు హాజరు కాని అంబరీష్.. మ్యూజిక్ ఈవెంట్లో పాల్గొని డ్యాన్సులు వేయటం.. అందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఎమ్మెల్యేగా ప్రజా సమస్యల్ని లేవనెత్తాల్సింది పోయి అందుకు భిన్నంగా డ్యాన్సులు వేస్తున్న వైనం ఇప్పుడు కలకలం రేపుతోంది. అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాకుండా ఇలా డ్యాన్సుల్లో బిజీగా ఉంటారా అంటూ అంబరీష్ తీరును తీవ్రంగా తప్పు పడుతున్నారు. అసెంబ్లీ ఎన్నికలు ముంగిట్లోకి వచ్చిన వేళ.. ప్రజాగ్రహానికి గురయ్యే అవకాశాన్ని చేజేతులారా ఇవ్వటం అంటే ఇదేనేమో?