సీఎం జ‌గ‌న్ మ‌రోసారి మ‌డ‌మ తిప్పేశాడుగా.. ఇదిగో వీడియో.. జోరుగా వైర‌ల్‌!!

Update: 2022-09-19 12:55 GMT
ఏపీ సీఎం జ‌గ‌న్‌.. గురించి.. వైసీపీ నాయ‌క‌లు ఒక విష‌యాన్ని తెగ ప్రచారం చేస్తుంటారు. ``మా నాయ‌కుడు మాట చెప్పాడంటే.. చేస్తాడంతే!`` అని వ్యాఖ్యానిస్తారు. అంతేకాదు.. ``మాట త‌ప్ప‌డు.. మ‌డమ తిప్ప‌డు`` అని చెబుతారు. ఇది.. 2019 ఎన్నిక‌ల‌కు ముందు.. జోరుగా ప్ర‌చారం జ‌రిగింది. వైసీపీ నాయ‌కులు గ‌ల్లీ గ‌ల్లీకి వెళ్లి దీనిని ప్ర‌చారం చేశారు. ఈ క్ర‌మంలో జ‌గ‌న్ అనేక మందికి అప్ప‌ట్లో ప‌లు హామీలు ఇచ్చారు. వీటిలో.. ఉద్యోగుల‌కు సీపీఎస్ ర‌ద్దు.. ప్ర‌త్యేక హోదా, పోల‌వ‌రం నిధులు.. పున‌రావాసం ప్యాకేజీ, ఏపీ రాజ‌ధాని అభివృద్ధి ఇలా.. అనేకం ఉన్నాయి.

అయితే.. అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత‌.. మాత్రం ఆయా అంశాల‌పై ఆయ‌న ఫుల్లుగా యూట‌ర్న్ తీసుకున్నారు. మాట‌-మడమ రెండు కూడా తిప్పేశార‌ని.. ఉద్యోగులు ఇప్ప‌టికీ.. ఘొల్లు మంటున్నారు. సీపీఎస్ ర‌ద్దు కోరుతూ.. రాష్ట్రంలో పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు కూడా చేశారు. అయినా.. వైసీపీ నాయ‌కులు.. ఇప్ప‌టికీ.. జ‌గ‌న్ ను మాట త‌ప్ప‌ని.. మ‌డ‌మ తిప్ప‌ని నాయ‌కుడిగానే పేర్కొంటున్నారు. కాగా.. తాజాగా అసెంబ్లీ వేదిక‌గా.. జ‌గ‌న్ త‌ర‌ఫున జ‌ల‌వ‌న‌రుల మంత్రి అంబ‌టి రాంబాబు చేసిన ప్ర‌క‌ట‌న .. జ‌గ‌న్ ఏ రేంజ్‌లో మ‌డ‌మ తిప్పేస్తారో.. స్ప‌ష్టం అవుతోంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

ఏం జ‌రిగింది?

పోల‌వ‌రం ప్రాజెక్టుపై.. అసెంబ్లీలో సోమ‌వారం చ‌ర్చ జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా గ‌త ప్ర‌భుత్వ నిర్వాకం కార‌ణంగానే పోల‌వ‌రం ప్రాజెక్టు నిర్మాణం ఆల‌స్య‌మైంద‌ని.. ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ అన్నారు. అంతేకాదు.. కాంట్రాక్ట‌ర్‌ను మార్చ‌డంతోపాటు.. క‌మీష‌న్ల కోసం.. క‌క్కుర్తి ప‌డ‌డంతోనే.. ప్రాజెక్టు ఇబ్బందుల్లో ప‌డింద‌న్నారు. ఇదేస‌మ‌యంలో పోల‌వ‌రం నిర్వాసితుల‌కు ఇవ్వాల్సిన ప్యాకేజీ విష‌యంపైనా.. జ‌గ‌న్ స్పందించారు. ఈ స‌మ‌యంలో టీడీపీ స‌భ్యులు ఆందోళ‌న‌కు దిగారు.

పోల‌వ‌రం నిర్వాసితుల‌కు జ‌గ‌న్ అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత రూ.10 ల‌క్ష‌ల వ‌ర‌కు ప్యాకేజీ ఇస్తామ‌ని చెప్పార‌న్నారు. అయితే.. ఇప్ప‌టి వ‌ర‌కు ప‌ది ల‌క్ష‌లు ఇవ్వ‌లేద‌ని ఆరోపించారు. ఈ క్ర‌మంలో ఇరు ప‌క్షాల మ‌ధ్య తీవ్ర వాగ్యుద్ధం చోటు చేసుకుంది. టీడీపీ స‌భ్యుడు బుచ్చ‌య్య చౌద‌రి మాట్లాడుతూ.. పోల‌వ‌రం నిర్వాసితుల‌కు ప‌ది ల‌క్ష‌ల రూపాయ‌లు ఇస్తామ‌ని.. ఎన్నిక‌ల‌కు ముందు.. జ‌గ‌న్ చెప్పార‌ని అన్నారు. ఈ మేర‌కు నిధులు ఇవ్వ‌కుండా..నిర్వాసితుల పొట్ట‌కొడుతున్నార‌ని అన్నారు.

దీనిపై జ‌ల‌వ‌న‌రుల మంత్రి.. అంబ‌టి రాంబాబు స్పందించారు. బుచ్చ‌య్య చౌద‌రి ప్ర‌సంగానికి అడ్డు ప‌డిన మంత్రి.. గ‌తంలో జ‌గ‌న్ ఎలాంటి హామీలు ఇవ్వ‌లేద‌న్నారు. పైగా.. బాధిత నిర్వాసితుల‌కు ఆరున్న‌ర ల‌క్ష‌లు ఇస్తామ‌ని.. గ‌త ప్ర‌భుత్వం చెప్పింద‌ని.. అవి ఇవ్వ‌కుండా.. ప్ర‌భుత్వం వెళ్లిపోయిందని.. ఆ భారం ఇప్పుడు తాము భ‌రిస్తున్నామ‌ని.. రాంబాబు వ్యాఖ్యానించారు. గ‌తంలో జ‌గ‌న్ ప‌ది ల‌క్ష‌లు ప‌రిహారంగా ఇస్తామ‌ని ఎక్క‌డా చెప్ప‌లేద‌న్నారు. అంతేకాదు.. ఆధారాలు ఉంటే.. చూపాల‌ని స‌వాల్ చేశారు.

క‌ట్ చేస్తే.. ఎన్నిక‌ల‌కు ముందు.. పోల‌వ‌రం ప్రాంతంలో ప‌ర్య‌టించిన జ‌గ‌న్‌.. అక్క‌డి నిర్వాసితుల‌తో మాట్లాడిన వీడియోను ఒక‌దానిని టీడీపీ నేత‌లు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ చేశారు.  ఈ వీడియోలో జ‌గ‌న్ మాట్లాడుతూ.. పోల‌వ‌రం నిర్వాసితుల‌కు.. చంద్ర‌బాబు ఆరున్న‌ర ల‌క్ష‌ల ప‌రిహార‌మే ఇస్తున్నార‌ని.. ఇది ఏమాత్ర‌మూ స‌రిపోద‌ని.. వ్యాఖ్యానించారు. ఈ విష‌యాన్ని అనేక మంది రైతులు త‌న ద‌గ్గ‌ర మొర పెట్టుకున్నార‌ని చెప్పారు. అందుకే.. త‌మ ప్ర‌భుత్వం ఏర్ప‌డ‌గానే.. ప‌ది ల‌క్ష‌ల ప‌రిహారం ఇస్తాన‌ని హామీ ఇచ్చారు. అయితే.. ఇప్పుడు మంత్రి అంబ‌టి మాత్రం.. అస‌లు ఆమాటే అన‌లేద‌ని అన్నారు.  అయితే.. నెటిజ‌న్లు మాత్రం.. జ‌గ‌న్ మ‌ళ్లీ మ‌డ‌మ తిప్పేశాడుగా అంటున్నారు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.


Tags:    

Similar News