రాజకీయం అన్న తర్వాత విమర్శ.. ప్రతి విమర్శ మామూలే. దాన్ని తప్పు పట్టాల్సిన అవసరం లేదు. ఆ మాత్రం కూడా అనకుంటే దాన్ని రాజకీయం అని ఎలా అంటారు. కానీ.. హద్దులు దాటిపోతున్న రాజకీయ వ్యాఖ్యలతో రెండు తెలుగు రాష్ట్రాలు వేడెక్కిపోతున్నాయి. ఈ తరహా హీటు తెలంగాణలో ఈ మధ్యన మొదలైతే.. ఏపీలో మాత్రం జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసింది మొదలు మొదలైందని చెప్పాలి. అది ముదిరి ముదిరి ఇప్పుడు మరింతగా పెరిగిపోయింది.
ఏపీ రాజకీయాల్లో ఎవరూ కూడా మార్యాదగా మాట్లాడే పరిస్థితి లేదు. మొదట్లో ఆవేశంగా కనిపించినా.. తర్వాతి కాలంలో ఆచితూచి అన్నట్లు మాట్లాడే జనసేన అధినేత పవన్ కల్యాణ్ సైతం ఉతికి ఆరేసేలా మాట్లాడటం మొదలు పెట్టారు. ఆయన మాత్రం ఎంతకాలమని భరిస్తారు? మరెంత కాలమని ఓపిక పడతారు? అందుకే.. తాను నమ్మే మర్యాదల్ని పక్కన పెట్టేసి మరీ ఉతికి ఆరేసేలా మాట్లాడటం మొదలుపెట్టారు. దీనికి ప్రతిగా వైసీపీ నేతలు మరింతలా చెలరేగిపోవటం చూస్తూనే ఉన్నాం.
ఈ క్రమంలో కొందరు వైసీపీ నేతలు కొందరు ప్రత్యేకంగా పవన్ ను టార్గెట్ చేస్తున్న తీరు ప్రతికూల ప్రభావాన్ని తీసుకొస్తుందంటున్నారు. గతంలో మాదిరి నాయకులు తమకు తోచినట్లుగా మాట్లాడితే సరిపోదు. ఎందుకంటే.. వారి మాటలకు సంబంధించిన వీడియోలు అందుబాటులో ఉండేవి కావు. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. సోసల్ మీడియా పుణ్యమా అని ప్రతి వీడియో అందుబాటులో ఉంది. తాజాగా అంబటి రాంబాబు వ్యవహారమే తీసుకుందాం. ఆయన జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు.
పవన్ ను టార్గెట్ చేసే విషయంలో వైసీపీ వ్యూహకర్తలు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. వీలైనంతవరకు పవన్ ను ఆయన సామాజిక వర్గానికి చెందిన నేతలతో దారుణంగా తిట్టిస్తున్నారు. అంబటిని ప్రయోగించటం కూడా ఆ కోవలోకే చెందుతుంది. తాజాగా ఆయన తన ట్విటర్ ఖాతాలో ఒక పోస్టు పెట్టారు. ''నువ్వు రంకెలేసినా.. బాబుతో కలిసొచ్చినా.. జగన్మోహన్ రెడ్డి గారి ఎడమ కాలి చిటికెన వేలు మీద ఈక కూడా ఊడదు'' అంటూ ఫైర్ అయ్యారు.
ఆయన పోస్టుకు ఒక నెటిజన్ షాకింగ్ రిప్లై ఇచ్చారు. 'మా నాయకుడికి కాదు కదా. మా జనసైనికుడి కాలిగోటికి కూడా నువ్వు సరిపోవురా'అంటూ వ్యాఖ్య చేయటమే కాదు.. తన మాటకు బలాన్ని చేకూర్చే ఒక వీడియోను పోస్టు చేశారు. 2019 ఎన్నికల వేళలో అంబటి తన ఎన్నికల ప్రచారం సందర్భంగా చేసిన వ్యాఖ్యల వీడియో అది. అందులో అంబటి మాట్లాడుతూ.. ''మీకు అభిమానం ఉండొచ్చు. ఉండనివ్వండి తప్పు లేదు. కానీ.. నా ప్రాణం తీసే పని మాత్రం చేయొద్దని మనవి చేసుకుంటున్నా. వారికి ఓటు వేస్తే వారు గెలవరు. నా ప్రాణం పోతుంది. అది గ్లాసు కాదు నా గుండెల్లో బాకు అవుతుంది. మనవి చేస్తున్నా. ప్రేమాభిమానాలు వేరు. రాజకీయం వేరు. దమ్మాలవాడ ప్రజలు.. అన్ని వర్గాల ప్రజలు నన్ను ఆశీర్వదించాలని కోరుతున్నా'' అని మాట్లాడిన అంబటి ఈ రోజున తమ జనసేనాని కించపరిచేలా ఎలా మాట్లాడతారు? అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇదంతా ఒక ఎత్తు అయితే.. అంబటి మాదిరే ఏపీ మంత్రి ఆర్కే రోజా సైతం పవన్ ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎడమ కాలి చిటికెన వేలు మీద ఈక కూడా ఉడదంటూ మండిపడ్డారు. తమ అధినాయకుడు జగన్ ను వీరుడిగా.. శూరుడిగా కీర్తించుకోవటం తప్పేం కాదు. అదే సమయంలో తాము లక్ష్యం చేసుకున్న పవన్ ను కించపరిచేలా మాట్లాడటాన్ని తప్పు పడుతున్నారు. తరచూ జగన్ ఎడమ కాలి చిటికెన వేలు ఈకను కూడా టచ్ చేయరన్న వ్యాఖ్యకు స్పందిస్తున్న జనసైనికులు.. ఎవరికి లేని రీతిలో జగన్ ఎడమ కాలి చిటికెన వేలుకు ఈక ఎందుకు ఉంటున్నట్లు? అన్న కౌంటర్ ఇస్తున్నారు. ఎడమ కాలి చిటికెన వేలును కూడా టచ్ చేయరన్నంతవరకు ఓకే. కానీ.. ఈక ప్రస్తావనను వైసీపీ నేతలు ఎందుకు తెస్తున్నట్లు? అన్న ప్రశ్న పలువరి నోట వస్తోంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.