వ్యాక్సినేషన్ కొనసాగుతున్నా, చికిత్సలు జరుగుతున్నా.. కరోనా మాత్రం మనదేశం నుంచి పూర్తిగా వెళ్లిపోయేటట్టు లేదు. ఇప్పటికే మనదేశంలో బ్రిటన్‌కు చెందిన కొత్త స్ట్రెయిన్ కరోనా కేసులు నమోదవుతున్నాయి. తాజాగా అమెరికాకు చెందిన వేరియంట్ కరోనా కేసులు కూడా వ్యాప్తి చెందుతున్నట్టు వైద్యులు గుర్తించారు. జన్యుమార్పిడి చెందిన కరోనా వైరస్‌నే కొత్త స్ట్రెయిన్ కరోనాగా పిలుస్తారు. అయితే ఇప్పటికే బ్రిటన్ స్ట్రెయిన్ ఆందోళన కలిగించగా.. తాజాగా అమెరికా కు చెందిన L452R మ్యుటేషన్, E484Q మ్యుటేషన్ కేసులు మన దేశంలో నమోదవుతున్నట్టు నేషనల్ సెంటర్ ఫర్ డిసీసీ కంట్రోల్ పేర్కొన్నది.
ప్రస్తుతం మహారాష్ట్రలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్న విషయం తెలిసిందే. వీటిలో ఎక్కువగా కొత్త స్ట్రెయిన్ కరోనా కేసులే ఎక్కువగా ఉన్నట్టు వైద్యులు అంటున్నారు. మహారాష్ట్రలో దాదాపు 20 శాతం కొత్త స్ట్రెయిన్ కేసులే ఉన్నాయట. ప్రపంచంలో కొత్తగా కొన్ని వేల రకాల కరోనా స్ట్రెయిన్లు పుట్టుకొచ్చాయి. ఇండియాలో రెండు కరోనా కొత్త స్ట్రెయిన్లు బయటపడ్డాయి. మహారాష్ట్రలో సెంటర్ ఫర్ డిసీస్ కంట్రోల్ శాస్త్రవేత్తలు.. మొత్తం 7 వేల శాంపిళ్లను గుర్తించారు. వాటిలో E484Q, L452R మ్యటేషన్లు ఉన్నట్టు సమాచారం. ఈ కేసులు కేవలం మహారాష్ట్రకే పరిమితమయ్యాయా? లేక ఇతర రాష్ట్రాలకు పాకాయా? అన్న విషయంపై వైద్యులు పరిశోధిస్తున్నారు.
కొత్త స్ట్రెయిన్లు ఎంతో ప్రమాదకరమని శాస్త్రవేత్తలు అంటున్నారు. కాబట్టి ఈ కొత్త స్ట్రెయిన్ల విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉంటడాలని సూచిస్తున్నారు. మిగతా స్ట్రెయిన్లతో పోల్చుకుంటే అమెరికా స్ట్రెయిన్ 50 శాతం ఎక్కువ వేగంతో వ్యాపిస్తుందని శాస్త్రవేత్తలు అభిప్రాయ పడుతున్నారు. కాబట్టి ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. ఒకవేళ వ్యాక్సిన్ వేయించుకున్నప్పటికీ కచ్చితంగా మాస్కులు ధరించాలని.. భౌతిక దూరం పాటించాలని సూచిస్తున్నారు. లేదంటే ప్రమాదం తప్పదని హెచ్చరిస్తున్నారు.
మరోవైపు కొత్త స్ట్రెయిన్ కేసు ఢిల్లీలో కూడా నమోదైంది. 38 ఏళ్ల ఓ వ్యక్తికి కొత్త స్ట్రెయిన్ కరోనా సోకినట్టు వైద్యులు గుర్తించారు. అతడిని ప్రస్తుతం ప్రత్యేక క్వారంటైన్ లో ఉంచారు. కొత్త స్ట్రెయిన్ కేసులు చాలా వేగంగా వ్యాపిస్తున్నందున ప్రజలంతా కచ్చితంగా టెస్టులు చేయించుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.