గంట ముందు కూడా గ‌ద్దె దిగ‌ర‌ట‌!

Update: 2018-07-20 05:48 GMT
గ‌డిచిన కొంత‌కాలంగా ముంద‌స్తు మీద సాగుతున్న అంచ‌నాల‌కు పూర్తిగా చెక్ ప‌డిన‌ట్లే. అదిగ‌దిగో ముంద‌స్తు అంటూ సాగిన హ‌డావుడికి పూర్తిగా చెల్లుచీటి ఇచ్చేసిన‌ట్లే. త‌రిగిపోతున్న ప్ర‌జాభిమానాన్ని కాపాడుకునే క్ర‌మంలో.. మ‌రో ప‌ది నెల‌ల త‌ర్వాత జ‌ర‌గాల్సిన ఎన్నిక‌ల్ని మూడు.. నాలుగు నెల‌ల ముంగిట్లోకి తీసుకొచ్చే ప్ర‌య‌త్నంలో మోడీ స‌ర్కారు ఉంద‌న్న ప్ర‌చారం జోరుగా సాగిన సంగ‌తి తెలిసిందే. అయితే.. ముంద‌స్తుతో మంచి కంటే చెడే ఎక్కువగా జ‌రిగే అవ‌కాశం ఉంద‌న్న అంచ‌నాకు మోడీ బ్యాచ్ వ‌చ్చిన‌ట్లుగా తెలుస్తోంది.

ఈ కార‌ణంతో జ‌మిలి పేరుతో  ఈ ఏడాది చివ‌ర్లో సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌తో పాటు.. ప‌దికి పైగా రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నిక‌లు నిర్వ‌హించాల‌న్న ఆలోచ‌న‌ను తాత్కాలికంగా ప‌క్క‌న పెట్టేసిన‌ట్లుగా తెలుస్తోంది. లోక్ స‌భ‌తో పాటు 13 రాష్ట్రాల‌కు ఒకేసారి ఎన్నిక‌లు జ‌రుగుతాయంటూ కేంద్ర‌మంత్రి ర‌విశంక‌ర్ ప్ర‌సాద్ ఒక ఇంట‌ర్వ్యూలో చెప్పిన నేప‌థ్యంలో ముంద‌స్తుపై ప‌లు అంచ‌నాలు వ్య‌క్త‌మ‌య్యాయి.

ఇలాంటి వాటితో లేనిపోని త‌ల‌నొప్పులు త‌లెత్తే అవ‌కాశం ఉంద‌ని భావించిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా తానే స్వ‌యంగా రంగంలోకి దిగారు. ముంద‌స్తు ముచ్చ‌ట లేద‌న్న విష‌యాన్ని క్లియ‌ర్ గా చెప్ప‌ట‌మే కాదు.. మ‌న‌సు అట్ట‌డుగు పొర‌ల్లో ఏదైనా డౌట్ ఉన్నా తీరిపోయేలా సింగిల్ స్టేట్ మెంట్ లో త‌మ ఉద్దేశం ఏమిట‌న్న‌ది క్లియ‌ర్ గా చెప్పేశారు.  

ముందుస్తు ఎన్నిక‌ల‌కు వెళ్లే ఆలోచ‌న ఏదీ లేద‌ని చెప్ప‌ట‌మే కాదు.. క‌నీసం గంట ముందు కూడా గ‌ద్దె దిగ‌బోమ‌న్న మాట‌ను తేల్చి చెప్పిన‌ట్లుగా చెబుతున్నారు. ప్ర‌జ‌లు ఐదేళ్ల‌కు అధికారాన్ని ఇచ్చార‌ని.. అలాంట‌ప్పుడు ముంద‌స్తుగా గద్దె దిగాల్సిన అవ‌స‌రం లేద‌న్న మాట‌ను చెప్పిన‌ట్లుగా తెలుస్తోంది.

దేశ వ్యాప్తంగా 51 శాతం ఓట్లు గెలుచుకోవ‌ట‌మే త‌మ ముందుఉన్న ల‌క్ష్య‌మ‌ని.. ప్ర‌తిప‌క్షాల ఐక్య‌త చెడ‌గొట్టే ఆలోచ‌న త‌మ‌కు లేదంటూ కాస్తంత ఎట‌కారంగా వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ త‌మ ప్ర‌ధాన‌మంత్రి అభ్య‌ర్థిగా రాహుల్ గాంధీని పెడితే త‌మ‌కు లాభ‌మేన‌ని అమిత్ షా చెప్పిన‌ట్లుగా చెబుతున్నారు. దేశ‌వ్యాప్తంగా బీజేపీ కోసం 14 కోట్ల మంది కార్య‌క‌ర్త‌లు ప‌ని చేస్తున్నార‌ని.. వారంద‌రి ఫోన్ నెంబ‌ర్లు.. గుర్తింపు కార్డులు.. ఇత‌ర వివ‌రాలు పార్టీ అధ్య‌క్షుడు అమిత్ సా వ‌ద్ద ఉన్న‌ట్లుగా చెబుతున్నారు. సో.. అమిత్ షా తాజా వ్యాఖ్య‌లు చూస్తే.. ముంద‌స్తుపై ఫుల్ క్లారిటీ వ‌చ్చిన‌ట్లేన‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.


Tags:    

Similar News