ఎన్నికల వేళ ఇదీ.. రాజకీయ నాయకులు తమ అహాన్ని అంతా పక్కనపెట్టి ప్రజల వద్దకు వచ్చే సమయం.. దేశాన్ని ఏలుతున్న బీజేపీ నాయకులు సంవత్సరం ముందే ఈ పని మొదలు పెట్టారు. ప్రతీ గడప తొక్కుతూ దేశంలో ప్రముఖుల మద్దతు కోసం వారి ఇంట్లో వాలుతున్నారు.
బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా ఇప్పుడు అదే పనిలో ఉన్నారు.. నాలుగేళ్లలో చేసిన గొప్పలు చెప్పుతూ మద్దతు కూడగడుతున్నారు. చెప్పుకుంటే ఓట్లు పడతాయో లేదో కానీ ఆ ప్రక్రియను మాత్రం మొదలుపెట్టే బీజేపీ ప్రచార పర్వాన్ని షూరు చేసినట్టే కనిపిస్తోంది. దీనికో పేరు కూడా పెట్టడం విశేషం. ‘సంపర్క్ ఫర్ సమర్ధన్’ పేరుతో బీజేపీ పాలనలో విజయాలపై ఓ పుస్తకం ముద్రించి దాన్ని సినీ -రాజకీయ - జర్నలిస్టు - వివిధ రంగాల ప్రముఖులకు పంచుతున్నారు. పనిలో పనిగా మద్దతివ్వాలని వేడుకుంటున్నారు.
తాజాగా ఈ పుస్తకాలను పట్టుకొని బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా.. కేంద్ర ఆర్థిక మంత్రి పీయూష్ గోయల్ తో కలిసి ఢిల్లీలో క్రికెటర్ ఎంఎస్ ధోనిని కలిశారు. మోడీ పాలన విజయాలను వివరించి తమకు అండగా నిలవాలని ధోనిని కోరారు. ధోని దీనికి సానుకూలంగా స్పందించినట్టు తెలిసింది.
అమిత్ షా ఈ కొత్త ప్రచారం ఆసక్తి రేపుతోంది. వరుసగా సినీ - క్రికెట్ సెలబ్రెటీలను ఆయన కలుస్తున్నారు. మోడీకి మద్దతు కోసం ప్రచారం చేయాలని కోరుతున్నారు. కొందరు సై అంటున్నారు.. కొందరు నై అంటున్నారు. ఎలాగైనా సరే 2019 ఎన్నికల్లో గెలవాలని అమిత్ షా-మోడీ వేసిన ఈ స్కెచ్ సక్సెస్ అవుతుందా లేదా అన్నది చూడాలి మరి..