కేసీఆర్ - జగన్ లకు బీజేపీ భయపడింది..!

Update: 2019-07-25 04:28 GMT
మోడీ షా జోడీ వరుసగా రెండు పార్లమెంట్ ఎన్నికల్లోనూ సత్తా చాటి దేశంలో అధికారం కొల్లగొట్టింది. మోడీ తెరవెనుక మంత్రాంగం నడిపితే.. షా మాత్రం డైరెక్ట్ యాటాక్ చేస్తుంటాడు. వీరి వ్యూహాలు అన్ని ఫలించాయి. అన్ని రాష్ట్రాల్లోనూ ఆధిక్యం లభించాయి. కానీ కొరకరాని కొయ్యలుగా తెలుగు రాష్ట్రాలు నిలిచాయి.  2014 తెలంగాణ ఎన్నికల్లో నాలుగు అసెంబ్లీ సీట్లు, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో 1 సీటే సాధించింది. కానీ పార్లమెంట్ కు వచ్చేసరికి 4 సీట్లు సాధించింది. ఇక ఏపీలో పోయిన సారి టీడీపీ బలంతో గెలిచింది. ఈసారి ఏపీలో బీజేపీ ఉనికే లేకుండా పోయింది. అయితే ఏపీలో ఓడిన టీడీపీ ప్లేసులోకి రావడానికి బీజేపీకి కాలం కలిసివస్తోంది.

అయితే హోంమంత్రిగా బాధ్యతలు చేపట్టిన అమిత్ షా పెండింగ్ బిల్లులు చూస్తుండగా.. తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల పెంపును చూసి మళ్లీ తాజాగా తెరపైకి తీసుకొచ్చాడట.. కేబినెట్ మీటింగ్ లో కూడా పెట్టారట. అసెంబ్లీ సీట్లు పెంచేసి తెలంగాణ - ఏపీలో బలపడుదామని ప్రతిపాదించాడు. కానీ మోడీ ఇతర సీనియర్లు నో చెప్పారు.

దేశమంతా మోడీషాల గాలి వీచినా ఏపీలో మొన్నటి ఎన్నికల్లో  బీజేపీ ఒక్క అసెంబ్లీ సీట్లన్నీ కూడా తెచ్చుకోలేదు. ఇక తెలంగాణలో టీఆర్ ఎస్ అభ్యర్థులపై స్థానికంగా వ్యతిరేకత.. ముఖ్యంగా బీజేపీలోని బలమైన వ్యక్తులైన అభ్యర్థుల వల్లే బీజేపీ గెలిచింది. అక్కడ బీజేపీని చూసి జనాలు ఓటు వేయలేదు. క్యాండిడేట్లను చూసే నిజామాబాద్ - ఆదిలాబాద్ - కరీంనగర్ - సికింద్రాబాద్ ఎంపీ స్థానాల్లో బీజేపీని గెలిపించారు.  

ఈ నేపథ్యంలోనే హోంశాఖ మంత్రిగా అసెంబ్లీ సీట్లను రెండు తెలుగు రాష్ట్రాల్లో పెంచుదామనుకున్నాడట అమిత్ షా. కానీ ఇక్కడ ఉన్నది బలమైన కేసీఆర్ - జగన్ - చంద్రబాబులు. ఈ సీట్ల పెంపును తమకు అనుకూలంగా మార్చుకోవడంలో దిట్టలు. అస్సలు బలం లేని బీజేపీ వాపును చూసుకొని బలం అనుకొని ముందుకెళ్తే మనకే నష్టం అని బీజేపీ అధిష్టానం పెద్ద నిర్ణారణకు వచ్చారట.. అందుకే కేసీఆర్ - జగన్ ల స్టామినాను తక్కువగా అంచనావేసిన అమిత్ షాకు బ్రేకులేసింది. తెలుగు రాష్ట్రాల అసెంబ్లీ సీట్లను పక్కనపెట్టినట్టు సమాచారం.

దేశవ్యాప్తంగా బీజేపీ గాలిని తట్టుకొని అస్సలు ఉనికే లేకుండా చేసిన సామర్థ్యం కేసీఆర్ - జగన్ ల సొంతం. ముఖ్యంగా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి చుక్కలు చూపించారు. అందుకే ఇప్పుడే ఈ ఇద్దరినీ ఢీకొట్టడం ఇష్టం లేకే వెనక్కితగ్గినట్టు తెలుస్తోంది.


Tags:    

Similar News