లాక్‌ డౌన్‌ పై ఏం చేద్దాం: సీఎం జ‌గ‌న్‌ తో కేంద్ర హోంమంత్రి అమిత్ షా

Update: 2020-04-26 12:37 GMT
క‌రోనా వ్యాప్తికి ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం నిరంత‌రం కృషి చేస్తోంది. ప‌క‌డ్బందీగా లాక్‌ డౌన్ కొన‌సాగిస్తూనే క‌రోనా నిర్ధార‌ణ ప‌రీక్ష‌లు ముమ్మ‌రంగా చేయిస్తోంది. రాష్ట్ర‌వ్యాప్తంగా భారీ సంఖ్య‌లో ప‌రీక్ష‌లు చేస్తూ అనుమానితుల‌ను అదుపులోకి తీసుకుని వారిని క్వారంటైన్‌ లో ఉంచుతున్నారు. దీంతో రాష్ట్రంలో క‌రోనా వైర‌స్ ఎక్క‌డ కూడా విస్త‌రించ‌కుండా క‌ట్టుదిట్టంగా చ‌ర్య‌లు తీసుకుంటున్నారు. ఈ చ‌ర్య‌ల‌తో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ కు ప్ర‌శంస‌లు కురుస్తున్నాయి. ఇప్ప‌టికే వైద్యారోగ్య శాఖ‌కు అన్ని స‌దుపాయాలు - ప‌రికరాలు అంద‌జేశారు. వైద్యులు - వైద్య సిబ్బందితో పాటు పోలీసులు - పారిశుద్ధ్య శాఖ‌ల‌కు అత్య‌ధిక నిధులు కేటాయించి క‌రోనా క‌ట్ట‌డికి ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి కృషి చేస్తున్నారు.

ఈ క్ర‌మంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదివారం ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌ కు ఫోన్ చేశారు. ఈ సంద‌ర్భంగా ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ లో క‌రోనా వ్యాప్తి - లాక్‌ డౌన్ అమ‌లుపై చ‌ర్చించారు. ఈ సంద‌ర్భంగా సీఎం జ‌గ‌న్ అమిత్ షాతో కొన్ని నిమిషాల పాటు మాట్లాడారు. రాష్ట్రంలో ఉన్న ప‌రిస్థితుల‌ను నివేదించారు. లాక్‌ డౌన్‌ పరిణామాలు - తర్వాత అనుసరించాల్సిన వ్యూహంపైన కేంద్ర‌మంత్రి అమిత్ షాతో చ‌ర్చించిన‌ట్లు ముఖ్యమంత్రి కార్యాల‌యం ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. రాష్ట్రంలో తీసుకుంటున్న చర్యలను కేంద్ర‌మంత్రికి ముఖ్య‌మంత్రి వివరించారు.  ప్రతి మిలియన్‌ జనాభాకు అత్యధిక పరీక్షలు నిర్వహించిన రాష్ట్రంగా ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ ప్రథమ స్థానంలో ఉంద‌ని సీఎం జ‌గ‌న్ తెలిపారు.

Tags:    

Similar News