పెద్దనోట్లు రద్దయి ఏడాదైన సందర్భంగా అధికార - ప్రతిపక్షాల మధ్య తారస్థాయిలో మాటల యుద్ధం సాగుతోంది. సామాజిక మాద్యమాల్లో ఒకరిపై ఒకరు ఘాటైన విమర్శలు చేసుకుంటున్నారు. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ చేసిన ట్వీట్ లను బీజేపీ జాతీయ అధ్యక్షుడు తనదైన శైలిలో తిప్పికొట్టారు. రాహుల్ పోస్టు చేసిన ఓ చిత్రాన్ని ఉద్దేశించి షా తీవ్రంగా స్పందించారు. అది ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కాదని - ‘ఇన్ కరెక్ట్ న్యూస్ కాంగ్రెస్’ అని షా వ్యంగోక్తులు చేశారు. తప్పుడు వార్తలు సృష్టించడంలో కాంగ్రెస్ దిట్ట అని ఆయన విరుచుకుపడ్డారు. గుజరాత్ ప్రతిష్టను దెబ్బతీయడానికి యత్నిస్తున్నారని ఆయన విమర్శించారు. కుట్రలు పన్నడంలో తలపండిపోయిన కాంగ్రెస్ అత్యంత చురుగ్గా పనిచేస్తోందని ఆయన ఎద్దేవా చేశారు.
డీమానిటైజేషన్ అమల్లోకి వచ్చి ఏడాదైన సందర్భంగా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఓ చిత్రాన్ని సోషల్ మీడియాలో పోస్టు చేశారు. పెద్దనోట్ల రద్దుతో జనం ఎదుర్కొన్న కష్టాలు ఏకరువుపెట్టారు. ఓ మాజీ సైనికుడు నగదు విత్ డ్రా చేసుకోవడానికి పడిన బాధలు తెలుపుతూ రాహుల్ ఫొటో పెట్టారు. అయితే దీనికి అమిత్ షా గట్టిగానే బదులిచ్చారు. నందలాల్ అనే ఆ మాజీ సైనికుడు పెద్దనోట్ల రద్దుకు మద్దతు తెలుపుతూ ఇచ్చిన ఇంటర్ వ్యూను బీజేపీ పోస్టు చేసింది. ఏదోవిధంగా అధికారంలోకి రావాలన్న ఉద్దేశంతోనే కాంగ్రెస్ ఇలాంటి తప్పుడు ప్రచారం చేస్తోందని షా ఆరోపించారు.
నల్లధనం - అవినీతిపై ప్రజలు సాధించిన విజయంగా పెద్ద నోట్ల రద్దు తొలి వార్షికోత్సవాన్ని ప్రధాని నరేంద్ర మోడీ అభివర్ణించారు. పెద్దనోట్ల రద్దు మూలంగా 3.68 లక్షల కోట్ల నల్లధనం వివరాలు ప్రభుత్వ చేతికి అందాయని - నల్లధనం యజమానుల పేర్లు - చిరునామాలు చేతికి చిక్కాయన్నారు. 23 లక్షల బ్యాంకు ఖాతాలపై దర్యాప్తు జరుగుతోందని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రకటించారు. అవినీతిని కూకటివేళ్లతో తొలగించేందుకు తాను ప్రారంభించిన ఉద్యమానికి హృదయపూర్వకంగా మద్దతు ఇచ్చిన దేశ ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. పెద్దనోట్ల రద్దు అనంతరం మొత్తం 15.28 లక్షల కోట్ల రూపాయలు బ్యాంకులో జమైతే ఇందులో నుండి 33 శాతం డబ్బు అంటే ఐదు లక్షల కోట్ల రూపాయలను దేశ జనాభాలోని 0.00011 శాతం మంది ప్రజలు జమ జేశారని నరేంద్ర మోడీ వెల్లడించారు. పెద్దనోట్ల రద్దు వలన ఉగ్రవాదం - నక్సలిజం నడ్డి విరిగిందన్నారు. ఆర్థిక వ్యవస్థలో బాగా పెరిగిపోయిన పెద్దనోట్ల చలామణి హవాలా - ఉగ్రవాదం - రియల్ ఎస్టేట్ రంగాల్లో బాగా ఉపయోగించేవారని ప్రధాన మంత్రి వివరించారు. పెద్దనోట్ల రద్దు వలన ఈ సమస్య పరిష్కారమైందన్నారు. ప్రస్తుతం దేశంలో 12 లక్షల కోట్ల పెద్దనోట్లు చలామణిలో ఉన్నాయి, పాత పెద్ద నోట్లు రద్దు కాకుండా ఉంటే 18 లక్షల కోట్ల పెద్దనోట్లు ఇప్పుడు చెలామణిలో ఉండేవని ఆయన తెలిపారు.