దేశంలోని ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల వేడి తారస్థాయికి చేరింది. అధికారం సాధించేందుకు ప్రధాన పార్టీలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ఓటర్లను ఆకట్టుకునేందుకు నేతలు తమదైన రీతిలో ప్రచారం చేస్తున్నారు. ఇటీవల.. కాంగ్రెస్ నేత ప్రియాంకా గాంధీ ఎన్నికల ప్రచారంలో భాగంగా అసోంలో పర్యటించారు.
బిశ్వనాథ్ జిల్లాలోని తేయాకు తోటలను సందర్శించిన ప్రియాంక.. అక్కడ తేయాకు కార్మికులతో ఆమె ముచ్చటించారు. అంతేకాదు.. తాను కూడా తేయాకులు తెంచే కార్మికురాలిగా మారిపోయారు. తలమీద వస్త్రాన్ని మలిచి పెట్టి, తేయాకులు తెంచివేసే బుట్టను తగిలించుకున్నారు. అంతేకాకుండా.. ఏప్రాన్ కూడా ధరించిన ప్రియాంక తేయాకులు కోశారు.
కాగా.. తాజాగా అసోంలో పర్యటించిన అమిత్ ప్రియాంకను ఎద్దేవా చేశారు. తేయాకులు పెరగకుండానే ఎలా కోస్తారని? అదంతా ఫొటో సెషన్ అని అన్నారు. ఆమె కేవలం పర్యాటకం కోసం వచ్చారని ఆరోపించారు. మరోవైపు రాజ్ నాథ్ కూడా విమర్శలు గుప్పించారు. నరేంద్ర మోడీని ఛాయ్ వాలా అన్నవారు.. ఇప్పుడు టీ ఆకులు తెంచుతూ కనిపిస్తున్నారని ఎద్దేవా చేశారు.