మ‌న్మోహ‌న్‌ కు మామూలు పంచ్ వేయ‌లేదుగా!

Update: 2017-12-14 07:09 GMT
రాజ‌కీయాలు అంతే మ‌రి. టైం వ‌చ్చిన‌ప్పుడు ఎవ‌ర‌న్న‌ది చూడ‌కుండా నిర్మోహ‌మాటంగా..నిర్దాక్షిణ్యంగా వ్య‌వ‌హ‌రించ‌టం మామూలే. మంచి త‌నమ‌ని ఊరుకుంటే మొద‌టికే మోసం వ‌స్తుంది మ‌రి. అందుకే.. వెనుకా ముందు చూసుకోకుండా అనాల్సిన నాలుగు మాట‌లు అనేస్తారు.

మ‌ళ్లీ అదే మ‌నిషి ఎదురుప‌డిన‌ప్పుడు అంతే మ‌ర్యాద‌గా.. న‌వ్వుతూ ప‌లుక‌రించుకోవ‌టం చేస్తుంటారు. ఇలాంటి సీనే.. నిన్న‌టికి నిన్న పార్టమెంటు ద‌గ్గ‌ర ఆవిష్కృత‌మైంది. 2001లో పార్ల‌మెంటుపై దాడి జ‌రిగిన ఘ‌ట‌న‌లో ప్రాణాలు కోల్పోయిన వారికి నివాళులు అర్పించ‌టానికి బుధ‌వారం పార్ల‌మెంటు ప్రాంగ‌ణానికి వ‌చ్చారు ప్ర‌ధాని మోడీ. అదే టైంలో అక్క‌డున్న మాజీ ప్ర‌ధాని మ‌న్మోహ‌న్ క‌నిపించారు. అంతే.. అంద‌రిలోనూ ఒకింత ఆస‌క్తి. ఇక‌.. మీడియా సంగ‌తి చెప్పాల్సిన అవ‌స‌ర‌మే లేదు.

గుజ‌రాత్ ఎన్నిక‌ల ప్ర‌చారం నేప‌థ్యంలో  మ‌నోహ్మ‌న్ వ‌ర్సెస్ మోడీ అన్న‌ట్లు న‌డుస్తున్న ఎపిసోడ్ నేప‌థ్య‌లో ఇరువురు నేత‌లు ఎలా రియాక్ట్ అవుతార‌ని చూసిన వారికి నిరాశే మిగిలింది. ఒక‌రికొక‌రు ఏ మాత్రం త‌గ్గ‌కుండా మ‌ర్యాద ఇచ్చి పుచ్చుకున్నారు. రాజ‌కీయాల్లో విమ‌ర్శ‌లు.. ప్ర‌తి విమ‌ర్శ‌లు మామూలే అయినా.. అవేమీ వ్య‌క్తిగ‌త స్థాయిలో త‌మ మ‌ధ్య ఉన్న సంబంధాల్ని ప్ర‌భావితం చేయ‌లేవ‌న్న‌ట్లుగా ఇద్ద‌రు వ్య‌వ‌హ‌రించారు. దీంతో.. మ‌సాలా దొరుకుతుంద‌ని ఫీలైన చాలామంది మీడియా మిత్రుల‌కు నిరాశే మిగిలింది.

ఇదిలా ఉంటే.. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఆస‌క్తిక‌ర వ్యాఖ్య చేశారు. త‌న‌ను విమ‌ర్శించ‌టంతో పాటు.. ఆరోప‌ణ‌లు చేసిన ప్ర‌ధాని మోడీ త‌న‌కు క్ష‌మాప‌ణ‌లు చెప్పాలంటూ మ‌న్మోహ‌న్ డిమాండ్ చేయ‌టం తెలిసిందే. ఈ వ్య‌వ‌హారంపై స్పందించిన షా.. మ‌న్మోహ‌న్ జీలో ఇటీవ‌ల కోపం క‌నిపిస్తోంది. ఆయ‌న హ‌యాంలో కుంభ‌కోణాలు జ‌రిగిన‌ప్పుడు.. ప్ర‌జ‌ల సొమ్మును లూటీ చేసిన‌ప్పుడు ఇంత కోపం ఎందుకు రాలేదంటూ చుర‌క‌లు అంటించారు.

అంతేనా.. గుజ‌రాత్ రాష్ట్రానికి ముఖ్య‌మంత్రిగా మోడీ వ్య‌వ‌హ‌రిస్తున్న స‌మ‌యంలో ఆయ‌న్ను మృత్యుబేహారి అన్న‌ప్పుడు.. సాక్ష్యాత్తు ఈ దేశ ప్ర‌ధానినే నీచుడ‌ని అన్న‌ప్పుడు ఎందుకింత కోపం రాలేదంటూ ప్ర‌శ్న‌ల మీద ప్ర‌శ్న‌లు వేశారు. అస‌లే మౌన సింగ్‌.. ఈ మ‌ధ్య‌న‌.. అదీ త‌న ఇమేజ్ హార‌తి క‌ర్నూరంలా కాలిపోతున్న వేళ క‌స్సుమ‌న్న ఆయ‌న్ను ఇన్నేసి ప్ర‌శ్న‌లు వేస్తే ఎలా అమిత్ షా జీ.  ఏమైనా..అవ‌కాశం చిక్కిన‌ప్పుడు ఏ స్థాయిలో ఉన్న నేత‌నైనా అస్సలు విడిచిపెట్ట‌కూడ‌ద‌న్న రాజ‌కీయ పాఠాన్ని అంద‌రికి అర్థ‌మ‌య్యేలా వ్య‌వ‌హ‌రిస్తున్న అమిత్ షాకు  థ్యాంక్స్ చెప్పాల్సిందే.
Tags:    

Similar News